పురుషుల్లో ‘వెరికోసిల్’తో సంతాన సామర్థ్యంపై ఎఫెక్ట్
Varicocele:వెరికోసిల్ లక్షణాలు & చికిత్స: మనలో చాలా మంది వంధ్యత్వం(infertility) అంటే మహిళల సమస్య అని భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే ఇన్ఫెర్టిలిటీ కేసుల్లో దాదాపు సగం పురుషుల్లోనే ఉంటాయి. మగాళ్లలో వంధ్యత్వానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ఒకటి వెరికోసిల్ (Varicocele). దీన్నితెలుగులో వృషణాల్లోని సిరలవాపు అంటారు. శస్త్రచికిత్స ద్వారా సరిచేయొచ్చు.
What is a varicocele? వెరికోసిల్ అంటే ఏంటి?
వృషణాల్లోని సిరల వాపును వెరికోసిల్ అంటారు. సాధారణంగా ఈ సిరలు వృషణాలను చల్లగా ఉంచడానికి సాయపడతాయి. దీనివల్ల నాణ్యమైన స్పెర్మ్ తయారవుతుంది. కొంతమందిలో ఈ సిరలు ఉబ్బుతాయి. దీన్నే వెరికోసిల్ అంటారు.
దీని వల్ల నష్టమేంటి?
ఈ పరిస్థితి వల్ల ఉష్ణోగ్రత పెరిగి స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేయడంతోపాటు దాని క్వాలిటీ, వీర్య కణాల సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఒక్కోసారి
వృషణాలు కుంచించుకుపోవచ్చు.
varicocele symptoms? వెరికోసిల్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది?
చాలా మంది పురుషుల్లో ఎలాంటి లక్షణాలు కనపడవు.కొంత మందికి వృషణాలు బరువుగా అనిపించడం కిందకు లగినట్లు అనిపించడం కనిపిస్తుంది. ఎక్కువ కాలం పిల్లలు పుట్టని సమయంలో డాక్టర్ను సంప్రదించినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్ లో ఈ విషయం బయటపడుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా వెరికోసెల్ను నిర్ధారించవచ్చు. దాని తీవ్రత ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. అయితే కొందరిలో త్వరగానే లక్షణాలు కనపడతాయి.
వృషణంలో మధ్యస్తం నుంచి విపరీతమైన నొప్పి
- సిరలు ఉబ్బి బయటికి కనపడటం
- సాధారణం కంటే వృషణాలు చిన్నగా ఉండటం
- ఎక్కువసేపు నిలబడినప్పుడు లేదా బరువులను ఎత్తినప్పుడు
- అసౌకర్యంగా ఉండటం
What causes varicocele? వెరికోసిల్ రావడానికి కారణం ఏమిటి?
వెరికోసిల్ ఎందుకు వస్తుందనే దానికి కచ్చితమైన కారణం చెప్పడం కష్టం. కానీ ఇది వృషణాల నుండి రక్తాన్ని తీసుకెళ్లే సిరలలోని కవాటాల సమస్యల వల్ల ఈ పరిస్థితి రావొచ్చు. కుడి వృషణంతో పోలిస్తే ఎడమ వృషణంలో వెరికోసిల్ ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఎడమ వృషణం నుంచి రక్తం ఎడమ వృషణ సిర ద్వారా ప్రధాన సిరలోకి ప్రవహించే మార్గం భిన్నంగా ఉంటుంది.ఎక్కువగా బరువులు ఎత్తడం, ఎతైన ప్రదేశం నుండి కింద పడటం వలన, కొన్ని రాకల దోమలు కుట్టడం వలన, వంశ పారంపర్యంగా కూడా యి వేరికోసిల్ వచ్చే అవకాశం వుంటుంది.
varicocele treatment చికిత్సలు ఏమున్నాయ్?
సాధారణంగా అన్ని వెరికోసిల్లకు చికిత్స అవసరం లేదు. కానీ మీకు పిల్లలు పుట్టడం ఆలస్యమవడం, టెస్టుల్లో స్పెర్మ్ నాణ్యత తక్కువ ఉన్నప్పుడు తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. వారికి వైద్యులు వేరికోసెలెక్టమీ అనే సింపుల్ ఆపరేషన్ చేస్తారు. ఇందులో భాగంగా
ఉబ్బిన సిరలను కుట్టివేస్తారు. ఇది పూర్తి సురక్షితం. ఒక్క రోజులోనే ఇంటికి వెళ్లొచ్చు. కొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు. కొన్ని సందర్భాల్లో సర్జరీ లేకుండా ఎంబోలైజేషన్(embolization) అనే పద్దతిలో ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ప్రభావిత సిరలను బ్లాక్ చేసి వాటిని సాధారణ స్థితికి తీసుకొస్తారు. ఇది కూడా సింగిల్ సిట్టింగ్ పూర్తవుతుంది. ఎలాంటి ప్రమాదం ఉండదు.
సంతాన సామర్థ్యం మెరుగుపడుతుందా?
ఈ చికిత్సల వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ మెరుగుపడుతుంది. దీనివల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. సహజంగానే గర్భం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో IVF చికిత్స ద్వారా కూడా పిల్లలను పొందవచ్చు. మీలో వెరికోసిల్ సమస్య ఉంటే, పిల్లలు పుట్టడంలో ఆలస్యమవుతున్నా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
