పురుషుల్లో ప్రోస్టేట్ వాపు.. మూత్రవిసర్జనలో ఇలా జరుగుతోందా?
Prostate inflammation in men
urine infection men symptoms ప్రోస్టేట్ గ్రంథి పురుషులలో మూత్రపిండాల కింద, మూత్రనాళం చుట్టూ ఉండే ఒక ముఖ్యమైన గ్రంథి. ఇది ఒక వాల్నట్ పరిమాణంలో ఉంటుంది. మగాళ్ల పునరుత్పత్తి వ్యవస్థలో ఇది చాలా కీలకం. వీర్యంలో ముఖ్యమైన ద్రవాన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా, శుక్రకణాలను
రక్షించే, పోషించే పని చేస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథి పరిమాణం క్రమంగా పెరగడం సహజం. కానీ కొన్ని సందర్భాల్లో ఇది అధికంగా పెరిగి ప్రోస్టేట్ వాపు(Benign Prostatic
Hyperplasia-BPH)నకు దారి తీస్తుంది. దీనివల్ల ప్రోస్టేట్ గ్రంథి లోపలి భాగంలోని కణజాలం విస్తరించి, మూత్రనాళాన్ని ఒత్తుతుంది. దీనివల్ల మూత్రం సులభంగా బయటకు రావడం కష్టమవుతుంది. ఇది ఒక సాధారణ సమస్య. దీనివల్ల వృద్ధుల్లో నిద్రకు ఆటంకం కలిగి ఇబ్బందులకు గురవుతుంటారు. అసలు ప్రోస్టేట్ వాపునకు కారణాలు, లక్షణాలు,చికిత్సా విధానాల గురించి అవేంటో చూద్దాం.
urine infection men symptoms ప్రోస్టేట్ వాపునకు కారణాలు
ప్రోస్టేట్ వాపునకు కచ్చితంగా ఇదే కారణమని చెప్పలేమంటున్నారు. వైద్యులు. అయితే అందుకు దారితీసే కొన్ని కారణాలను డాక్టర్లు వివరించారు.
హార్మోన్ మార్పులు: వయసుతోపాటు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్ల స్థాయిల్లో మార్పులు జరుగుతాయి. ఇవి ప్రోస్టేట్ కణాల పెరుగుదలకు దారి తీస్తాయి.
జన్యు ప్రభావం: కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ సమస్య ఉంటే, తదుపరి తరాలకు వచ్చే అవకాశం ఎక్కువ.
వయసు: 50 ఏళ్ల తర్వాత ప్రోస్టేట్ వాపు సమస్య గణనీయంగా పెరుగుతుంది.
జీవనశైలి: అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, అధిక మద్యం, ధూమపానం కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. హార్మోన్ డీహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) ప్రభావం: ఈ హార్మోన్ ప్రోస్టేట్ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది.
urine infection men symptoms ప్రోస్టేట్ వాపు లక్షణాలు
- ప్రోస్టేట్ వాపు లక్షణాలు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా కనిపిస్తుంటాయి.
- మూత్రం మెల్లగా రావడం లేదా మధ్యలో ఆగిపోవడం, మూత్రం పూర్తిగా ఖాళీ కానట్టుగా అనిపించడం.
- బలవంతంగా మూత్రం విసర్జించాల్సిరావడం. తరచూ మూత్రం రావడం.. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువగా రావడం.
- కొన్ని సందర్భాల్లో మూత్రం లీక్ అవడం సమస్యలు.
సమయానికి చికిత్స చేయకపోతే ప్రోస్టేట్ వాపు వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. మూత్రం నిల్వ ఎక్కువై మూత్రపిండాలపై ఒత్తిడి పెరగొచ్చు. దీనివల్ల కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు మూత్రాశయంలో రాళ్లు వస్తాయి. ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఒక్కోసారి పూర్తిగా మూత్రం బయటికి రాక మూత్రాశయం చీలిపోయే ప్రమాదం ఉంది.
ప్రాథమిక దశలోనే ఈ సమస్యను గుర్తిస్తే మందుల ద్వారా తగ్గించడానికి వీలవుతుంది. ఎక్కువ నెలలుగా ఈ సమస్య వేధిస్తుంటే ఆపరేషన్లకు వెళ్లాల్సి ఉంటుంది.
అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలు
1. iTIND(నిటినోల్ పరికరాన్ని తాత్కాలికంగా అమర్చడం) ఈ ప్రక్రియ ఒక రోజులో ముగుస్తుంది. నిటినోల్ అనే ఒక చిన్న పరికరాన్ని మూత్రనాళంలో ఉంచుతారు. 5-7 రోజుల్లో ఇది ప్రోస్టాటిక్ మూత్రనాళాన్ని సురక్షితంగా పునర్ నిర్మిస్తుంది. ఆ తర్వాత ఈ పరికరాన్ని తొలగించవచ్చు.
2. యూరోలిఫ్ట్ సిస్టమ్ : రోగికి తేలికపాటి అనస్థీసియా ఇచ్చి విస్తరించిన ప్రోస్టేట్ గ్రంథిలో చిన్న ఇంప్లాంట్స్ను ఉంచుతారు. దీనివల్ల మూత్ర ప్రవాహం మెరుగుపడుతుంది. 1-2 రోజుల్లోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది.
3. రెజుమ్ వాటర్ వేపర్ థెరపీ: ఈ పద్ధతిలో నీటి ఆవిరి శక్తిని ఉపయోగించి ప్రోస్టేట్ పరిమాణాన్ని కుదించవచ్చు. కొన్ని వారాల్లో సాధారణ స్థితికి ప్రొస్టేట్ వస్తుంది. కనిష్ఠంగా 30 నిమిషాల్లో చికిత్స పూర్తవుతుంది.
4. లేజర్ చికిత్స:హోల్మియమ్ లేజర్ ఎన్యూక్లియేషన్ ఆఫ్ ప్రోస్టేట్ (థూలియమ్ లేజర్ ఎబ్లేషన్ లేదా ఎన్యూక్లియేషన్) అనే లేజర్ చికిత్సల ద్వారా ప్రోస్టేట్ గ్రంథిని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు. హార్ట్ సమస్యలు, బీపీ, డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారికి ఇది సురక్షితం. ప్రొస్టేట్ వాపు సమస్యలకు అందుబాటులో ఉన్న అధునాతన చికిత్సలతో త్వరగా కోలుకొని రోజువారీ జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు

