thyroid disease symptoms female మహిళలకు థైరాయిడ్ క్యాన్సర్ ముప్పు
thyroid cancer symptoms women ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు, మరణాలకుగల ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. 2020లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి తొంభై లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని అంచనా. ప్రపంచమంతటి మరణాల్లో రెండో అతి ప్రధాన కారణం క్యాన్సర్.
ఈ ప్రాణాంతక వ్యాధి వల్ల 2020లో దాదాపు 99 లక్షల మంది చనిపోయారు. ఈ కేసుల విషయంలో భారతదేశమూ మినహాయింపు కాదు. మన దేశంలోనూ ప్రతి ఏటా 13 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, వీళ్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది
మరణిస్తున్నారు.
ఇతర క్యాన్సర్ల తో పోలిస్తే థైరాయిడ్ క్యాన్సర్ ఇటీవల చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. మన దేశంలో ఏటా 20,000 కంటే ఎక్కువగా థైరాయిడ్ కేసులు నమోదవుతుండగా… వీళ్లలో దాదాపు 4,000 మంది మరణిస్తున్నారు.
థైరాయిడ్ క్యాన్సర్ ముందే గుర్తించడం మంచిది
థైరాయిడ్ క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే శస్త్రచికిత్స, రేడియేషన్, అయోడిన్ వంటి చికిత్సలతో దీన్ని దాదాపుగా పూర్తిగా నయం చేయవచ్చు. ఇది మరీ ముదిరితే మరింత అధునాతనమైన,
ప్రభావవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ సరికొత్త చికిత్స ప్రక్రియలన్నీ నిర్దిష్టంగా థైరాయిడ్ క్యాన్సరే లక్ష్యంగా పనిచేస్తాయి.
థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు
వంశపారంపర్యం, కుటుంబ చరిత్ర, వయస్సు, లింగ భేదం… వంటివి థైరాయిడ్ క్యాన్సర్ కారణాల్లో కొన్ని. ఏ వయసు వారికైనా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ముఖ్యంగా 60 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రేడియేషన్
కు ఎక్కువగా ఎక్సపోజ్ కావడం, ఊబకాయం, ఆహారంలో అయోడిన్ మోతాదులు ఎక్కువగా ఉండటం వంటి అంశాలూ ఈ క్యాన్సర్కు కారణం.
thyroid cancer symptoms women థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు
మెడ దగ్గర వాపు, మెడ ముందు భాగంలో నొప్పి, ఇది కొన్ని సార్లు చెవుల వద్దకు పాకడం, గొంతు బొంగురు పోవడం, మింగడం కష్టంగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడతెరపి లేకుండా దగ్గు రావడం వంటివి దీని లక్షణాల్లో కొన్ని. ఈ లక్షణాలు కేవలం థైరాయిడ్ క్యాన్సర్ లోనే కాకుండా… గొంతు ప్రాంతంలో వచ్చే ఇతర క్యాన్సర్లలోనూ కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్ని సంప్రదించి, వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవడం
అవసరం.
థైరాయిడ్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
అల్ట్రాసౌండ్, నీడిల్ బయాప్సీ, న్యూక్లియర్ స్కాన్, CT స్కాన్, MRI, థైరాయిడ్ ఇమేజింగ్ పరీక్షల ద్వారా థైరాయిడ్ క్యాన్సర్ను నిర్ధారించడంతో పాటు వ్యాధి దశ, ఎంతవరకు వ్యాపించిందనే
విషయాలను తెలుసుకోవచ్చు.
థైరాయిడ్ క్యాన్సర్ చికిత్స
థైరాయిడ్ క్యాన్సర్ కనిపించినప్పుడు ప్రధానంగా థైరాయిడెక్టమీ శస్త్రచికిత్సతో థైరాయిడ్ గ్రంథిని తొలగిస్తారు. కణితి ఉన్న వైపు థైరాయిడ్ గ్రంథి భాగాన్ని తొలగించడంతో పాటు ఈ గ్రంథి వెలుపలి భాగంలో ఉన్న కణుతులకూ చికిత్స చేస్తారు. అది విస్తరించిందని
అనుమానించిన భాగాలన్నింటికీ శస్త్రచికిత్స చేస్తారు. ఈ చికిత్సలు క్యాన్సర్ దశ, ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో ప్రారంభ దశల్లో థైరాయిడెక్టమీ, రేడియోధార్మిక అయోడిన్ (ఆర్ఎఐ)
చికిత్స చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. చికిత్స తర్వాత మళ్లీ ఇదే క్యాన్సర్ పునరావృతమైన సందర్భాల్లో ‘రేడియో అయోడిన్ చికిత్స ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను రాబడతారు.
‘ఆర్ఎఐ’ చికిత్సను తరచుగా లింఫ్ నోడ్స్ మీద కణుపులకూ, లేదా ప్రధాన ప్రాంతం నుంచి దూరంగా విస్తరించిన క్యాన్సర్లలోనూ ఇస్తుంటారు. శస్త్రచికిత్స ద్వారా తొలగింపునకు సాధ్యం కాని క్యాన్సర్ కణజాలాన్ని పూర్తిగా నాశనం చేయడమే ఈ చికిత్స లక్ష్యం. ఒకవేళ బాధితులు
‘ఆర్ఎస్ఐ’కి స్పందించకపోతే వ్యాధి వ్యాప్తి చెందిన భాగాలకు ‘టార్గెటెడ్ థెరపీ’ లేదా ‘కీమోథెరపీ’లతో చికిత్స చేయాల్సి ఉంటుంది.
థైరాయిడ్ క్యాన్సర్ కు వైద్యుల పర్యవేక్షణ అవసరం
థైరాయిడ్ క్యాన్సర్ బాధితులు తమ వ్యక్తిగత ప్రొఫైల్ను, వ్యాధి సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు తమకు చికిత్స అందించే డాక్టరు తెలుపుతూ ఉండాలి. చికిత్స పూర్తయ్యాక కూడా దాదాపు జీవిత కాలమంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. థైరాయిడ్ క్యాన్సర్ నుంచి బయటపడాలంటే వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా కీలకం. ఇందుకు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి.
థైరాయిడ్ క్యాన్సర్ మొత్తం 5 రకాలు ఉంటాయి. వీటి గురించి, వీటి లక్షణాల గురించి అవగాహనతో పెంచుకొని, అప్రమత్తంగా ఉండాలి. మొదట్లోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం అన్నది ఏ క్యాన్సర్ లో నైనా మంచి ఫలితాలను ఇచ్చే
అంశం. అందుకే క్యాన్సర్ పై పోరాటంలో ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని, మంచి సమన్వయంతో పని చేస్తే ఫలితాలు కూడా అంతే బాగుంటాయి. బాధితుల ఆరోగ్యంలో మంచి పురోగతి కనిపిస్తుంది.

