Medications for Health Risks

Medications for Health Risks

ఈ “మూడు” రకాల మందులను అతిగా వాడితే చాల ప్రమాదం !

Medications for Health Risks ఔషధాలు ఎలాంటివైనా సరే అతిగా వాడితే అనర్థాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా పల్లె ప్రాంతాలలో ఈ వినియోగం ఎక్కువగా ఉంది ప్రతి సంవత్సరం డాక్టర్ సలహా లేకుండా ఈ మందులు వాడి కొన్ని లక్షల మంది ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు దీనికి ముఖ్య కారణం హాస్పిటల్ ఖర్చులు భారీగా పెరిగిపోవడం ప్రజల్లో సరియైన అవగాహన లేకపోవడం వల్ల ఈ మందులను వినియోగిస్తున్నారు ఈ మెడిసిన్ వాడటం వల్ల వెంటనే పెద్ద ప్రమాదం చూపకుండా భవిష్యత్తులో చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురుకోవలసి ఉంటుంది

అవసరం లేకున్నా ,డాక్టర్ సలహా లేకున్నా ఎడపెడ ఎవి పడితే అవి మందులు వాడుతున్న వాటివల్ల బవిషత్ లో చాల ప్రమాదం పొంచి వుంది. సాధారణంగా ప్రజలు వాడే కొన్ని మందులతో కూడా ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు అది వారాల తరబడి మనని వేధిస్తుంటే తప్పకుండా డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు వాడాలని ఎలా పడితే అలా మందులు వాడకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

1. ప్రొటాన్ పంప్ ఇన్‌హిబిటర్స్

కడుపులో మంటతో ఇబ్బంది పడే వారు ప్రోటాన్ పంప్ ఇన్‌హిబిటర్ అనే ఔషధాలను ఎక్కువగా వాడుతుంటారు. వీటితో కూడా ప్రమాదం లేకపోలేదని డాక్టర్లు అన్నారు. దీర్ఘకాలం పాటు ఇవి వాడితే కడుపులో జీర్ణరసాలు ఊరడం తగ్గి ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా పోషకాల లోపం తలెత్తి వ్యక్తులు బలహీనపడే ముప్పు పెరుగుతుంది. కాబట్టి, ఈ మందులకు బదులుగా ప్రోబయాటిక్స్ అధికంగా ఉండే పెరుగు లేదా యాపిల్ సిడర్ వెనిగర్ వంటివి తీసుకుంటే కడుపు మంట సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.

2. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్

ఒంటి నొప్పులు తగ్గించే ఐబ్యూప్రూఫెన్, సెలీకాక్సిబ్, నాప్రోక్సెన్ వంటి మందులను (నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్) ఇవి చాల ప్రమాదం ప్రజలు వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఇవి అక్కడ పడితే అక్కడ దొరుకుతాయి  తక్షణ ఫలితం ఇచ్చే ఈ మందులకు పాప్యులారిటీ ఎక్కువ. అయితే, వీటి సైడ్ ఎఫెక్ట్స్‌ను పేషెంట్లు తక్కువగా అంచనా వేస్తుంటారని స్టీవ్ హాఫార్ట్ చెప్పారు. హాఫార్ట్ చెప్పే దాని ప్రకారం.. దీర్ఘకాలం పాటు ఈ మందులను వాడితే పేగు లోపలి పొరలు దెబ్బతింటాయి. ఇది చివరకు అల్సర్స్, బ్లీడింగ్ వంటి సమస్యలకు దారి తీస్తాయి. ఈ మందుల వల్ల కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. నగరాల్లో కిడ్నీ వ్యాధులతో సతమతమయ్యే వారి సంఖ్య పెరగడానికి ఇదీ ఒక కారణం. కాబట్టి ఈ మెడిసిన్స్‌కు బదులు ఆహారంలో మార్పులు చేయడం, పసుపు వినియోగం పెంచడం, మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలను తింటే మరింత మెరగైన ఫలితాలు పొందొచ్చు.

3. స్టాటిన్స్.

కొలెస్టరాల్‌ లెవెల్స్‌ను తగ్గించేందుకు వాడే స్టాటిన్స్‌తో గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. అయితే, ఇన్‌ఫ్లమేషన్ అధికంగా ఉన్న వారిలో ఈ మందుల వల్ల విటమిన్ డీ లెవెల్స్ తగ్గే ప్రమాదం ఉంది. కండరాల మెరుగ్గా పనిచేసేందుకు, శక్తి ఉత్పత్తికి అవసరమయ్యే విటమిన్ డీ తగ్గితే పలు రకాల సమస్యల వస్తాయి. టైప్-2 డయాబెటిస్, జ్ఞాపకశక్తి సమస్యలు, హార్మోన్‌ల అసమతౌల్యత వంటివి తలెత్తుతాయి. కాబట్టి ఇన్‌ఫ్లమేషన్, కొలెస్టెరాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకునేందుకు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడంతోపాటు, జీవన శైలి మార్పులు చేసుకుంటే మెరుగైన ఫలితాలను వస్తాయి.

 

 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *