back pain thaggalante emi cheyali

how to control back pain in telugu మనం నిలబడాలన్నా, ఒంగోవలన్న , పక్కకు తిరగాలన్నా, మనకు ఆధారం వెన్నుముక. మనల్ని జీవితాంతం నిలబెట్టి ఉంచేది ఇదే. అలాంటి ఈ స్పైన్ కి ఏదైనా ఇష్యూ అయ్యి ఒక రెండు రోజులు బ్యాక్ పెయిన్ వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎటూ కదలలేం ఏ పని చేయలేం. అయితే ప్రపంచంలో ఉన్న 80% మంది ప్రజలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా బ్యాక్ పెయిన్ తో బాధపడతారట. అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది డాక్టర్ ని విజిట్ చేయడానికి గల కారణాలలో నడుము నొప్పి ఐదవ ప్లేస్ లో ఉంది. మరి ఇంతమంది ఇబ్బంది పడుతున్న బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? అసలు మనం స్ట్రెయిట్ గా నిలబడడానికి కారణమైన వెన్ను ఒక నిర్మాణం ఎలా ఉంటుంది? ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంటే ఎలా తగ్గించుకోవాలి? ఎక్కువమంది ఇబ్బంది పడే సయాటికా అంటే ఏమిటి? బ్యాక్ పెయిన్ కి, కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే పెయిన్ కి తేడా ఎలా తెలుసుకోవాలి? ఇలా బ్యాక్ పెయిన్ గురించి మనకి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఇవి తెలుసుకోవడం వల్ల ఇన్ కేస్ బ్యాక్ పెయిన్ వల్ల మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్ గారు చెప్పే విషయాలు మనకు ఈజీగా అర్థమవుతాయి.
అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో తెలియాలంటే ముందు మన వెన్నుముక నిర్మాణం గురించి మనకు అర్థం అవ్వాలి. వెన్నుముకని స్పైన్ అని అంటారు. ఈ వెన్నుముక చూడడానికి s లెటర్ షేప్ లో ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో ఈ ఎస్ షేప్ కోల్పోయి సి షేప్ లోకి మారుతుంది. అందుకే ముసలివాళ్ళు ముందుకు వంగి నడుస్తూ ఉంటారు. ఈ వెన్నుముక పై నుండి క్రింద వరకు ఒకే ఎముకలా కాకుండా వెర్టిబ్రీ అనే 33 చిన్న చిన్న ఎముకలతో తయారై ఉంటుంది.
how to control back pain in telugu వెన్ను ముక ఎన్ని బాగాలుగా వుంటుంది
పై నుండి కింద వరకు మొత్తం వెన్నుముకను చూసుకుంటే ఇది ఐదు భాగాలుగా ఉంటుంది. ముందుగా పైన ఉండేది సర్వైకల్ రీజియన్ ఇది మెడ భాగంలో ఉంటుంది. దీనిలో ఏడు సర్వైకల్ బోన్స్ లేదా సర్వైకల్ వెర్టిబ్రలు ఉంటాయి. వీటిని సింపుల్ గా C1, C2, C3 ఇలా C7 వరకు చెప్తారు. ఇవి మన తలకు సపోర్ట్ గా ఉంటూ తలను అటు ఇటు తిప్పడానికి ఉపయోగపడతాయి.
తరువాత భాగాన్ని థొరాసిక్ రీజియన్ అంటారు. ఇవి ముందు చెప్పుకున్న బోన్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. దీనిలో 12 థొరాసిక్ వెర్టిబ్రీస్ ఉంటాయి. వీటిని T1, T2, T3 ఇలా T12 వరకు చెప్తారు. ఇవి చాతిలో ఉండే రిబ్స్ తో అంటే పక్కట ఎముకలతో కలిసి ఉండి చెస్ట్ ఏరియాకి సపోర్ట్ గా ఉంటాయి.
తరువాత లోవర్ రిబ్ నుండి పెల్విస్ వరకు ఉండే భాగాన్ని లంబార్ రీజియన్ అంటారు. దీనిలో ఐదు లంబార్ వెర్టిబ్రేలు ఉంటాయి. L1, L2, L3, L4, L5 ఇలా ఐదు బోన్స్ ఉంటాయి. పైన ఉండే అప్పర్ బాడీ వెయిట్ అంతా వీటి మీద పడుతుంది.
ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు భాగాలు కూడా మూవబుల్ పోర్షన్స్ అంటే విడివిడిగా ఉండే ఈ బోన్స్ మధ్యలో మూమెంట్ ఉంటుంది. ఇక నాలుగవది శక్రల్ రీజియన్. ఇది చూడడానికి ట్రయాంగిల్ షేప్ లో ఒకటే ఎముకలా ఉంటుంది కానీ నిజానికి s1 s2 s3 s4 s5 ఇలా ఐదు ఇండివిడ్యువల్ బోన్స్ తో తయారై ఉంటుంది. ఇవి మనం పుట్టినప్పుడు విడివిడిగానే ఉంటాయి. కానీ 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో అవి కలిసిపోయి ఒక బోన్ గా మారిపోతుంది. ఈ సింగిల్ బోన్ ని చక్రం అని కూడా అంటారు. ఇక ఐదవ రీజియన్ చివర్లో ఉంటుంది. దానిని కాక్సిజిల్ రీజియన్ అంటారు. దీనిలో CO1, CO2, CO3, CO4 ఇలా నాలుగు కాక్సిజిల్ అనే చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. ఇవి కూడా వయసు పెరిగే కొద్దీ అన్ని కలిసి ఒకటిగా మారిపోతుంది. దీనిని కాక్సిక్స్ లేదా టైల్ బోన్ అని అంటారు. ఈ మొత్తం 33 బోన్స్ అన్ని కలిసి ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ అయి ఉంటాయి. ఇలా ప్రతి వెర్టిబ్రే కి అంటే ప్రతి బోన్ కి మధ్యలో డిస్క్ అనే మెత్తటి భాగం ఉంటుంది. ఇవి స్ప్రింగ్ లా పని చేస్తూ షాక్ ని అబ్సర్బ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ డిస్క్ కి బయట లేయర్ థిక్ గా ఉంటుంది. సెంటర్ లో భాగం సాఫ్ట్ జెల్ లా ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఈ డిస్క్ లో దాదాపు 80% వాటర్ కంటెంట్ ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ అది తగ్గిపోయి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. మీకు తెలుసా ఉదయం నిద్ర లేచినప్పటితో పోల్చుకుంటే రాత్రి పడుకునే సమయంలో మన హైట్ అనేది 1 టు సెంటమీటర్లు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పగలంతా వెయిట్ అనేది ఈ డిస్క్ల మీద పడడంతో ఈ డిస్క్లు కంప్రెస్ అయిపోయి వీటిలోని ఫ్లూయిడ్స్ ని కోల్పోతూ ఉంటాయి. దాని వల్ల పగటి సమయంలో హైట్ తగ్గుతూ ఉంటుంది. కానీ రాత్రి పడుకున్న సమయంలో వీటి మీద ప్రెజర్ ఉండదు కాబట్టి ఈ డిస్క్ లు మళ్ళీ బాడీ లోని వాటర్ ని తీసుకొని నార్మల్ హైట్ కి వస్తాయి.
how to control back pain in telugu ఈ వెన్ను ముక్క ఉపయోగం ఏంటి?
ముందు చెప్పుకున్నట్లుగా మనం స్ట్రైట్ గా నిలబడడానికి బెండ్ అవ్వడానికి యూస్ అవుతుంది. అంతేకాదు మన స్పైనల్ కార్డ్ ని అంటే [వెన్నుపాముని] కూడా రక్షిస్తూ ఉంటుంది. మన బాడీలో మెదడు ఎంత ఇంపార్టంటో ఈ వెన్నుపాము కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మెదడు నుండి బాడీకి బాడీ నుండి మెదడు కి సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. అలా ప్రతి సెకండ్ కి కొన్ని లక్షల సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఈ స్పైనల్ కార్డ్ కి ఏదైనా జరిగితే డామేజ్ అయిన భాగాన్ని బట్టి బాడీలోని కొన్ని భాగాలు పని చేయవు పెరాలసిస్ రావచ్చు స్పర్శ కోల్పోతారు. అందుకే ఈ స్పైనల్ కార్డ్ ని మన వెన్నుముక్క ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న చిన్న చిన్న బోన్స్ ని గమనిస్తే వాటికి వెనక భాగంలో ఒక హోల్ ఉంటుంది. ఈ బోన్స్ అన్నిటిని ఒక దాని మీద ఒకటి పెడితే ఒక టన్నెల్లా ఏర్పడుతుంది. దీనిని స్పైనల్ కెనాల్ లేదా వెర్టిటబ్రల్ కెనాల్ అంటారు. దీనిలో వెన్నుపాము సేఫ్ గా ఉంటుంది. అలాగే ఈ వెన్ను ముక్క లోని చిన్న చిన్న బోన్స్ ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు వాటి పక్కల నుండి చిన్న సంధులు ఉంటాయి. వీటి ద్వారా వెన్నుపాము నుండి వచ్చే 31 జతల వెన్ను నాడులు రెండు వైపుల నుండి బాడీ అంతటా విస్తరించి ఉంటాయి. బ్రెయిన్ నుండి వచ్చే సిగ్నల్స్ వెన్నుపాము ద్వారా ప్రయాణించి ఈ నాడుల ద్వారా బాడీ అంతటికి చేరుతాయి. కేవలం ఈ వెన్ను ముక్క ఒకటే కాకుండా దానికి సపోర్ట్ గా పై నుండి క్రింద వరకు కొన్ని మజిల్స్, లెగమెంట్స్, ఫాసెట్ జాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి మన వెన్ను భాగం ఒక స్ట్రాంగెస్ట్ స్ట్రక్చర్ గా తయారవుతుంది. ఇవన్నీ కలిసిన మన వెన్నుముక 2600 నుండి 3300 పౌండ్ల ఫోర్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు. కానీ మజిల్స్ లెగమెంట్స్ ఫాసిట్ జాయింట్స్ ఏమీ లేకుండా ఓక వెన్ను ముక్క ఒక్కటే ఉంటే అది కేవలం 4.7 పౌండ్స్ ఫోర్స్ ని మాత్రమే హ్యాండిల్ చేయగలదు. కాబట్టి చుట్టూ ఉండే మజిల్స్ లెగమెంట్స్ వెన్నుకి ఎంత బలాన్ని ఇస్తాయో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసి మన వెన్ను ముక్క మీద పడే షాక్ ని స్ట్రెస్ ని అబ్సర్బ్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. వెన్ను ముక్క మీద ప్రెజర్ ని తగ్గిస్తాయి. ఇప్పటివరకు మనం వెన్నుముఖ నిర్మాణం గురించి తెలుసుకున్నాం.
how to control back pain in telugu అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది?
మనకు వచ్చే బ్యాక్ పెయిన్ లో 97% మెకానికల్ ఇష్యూస్ వల్లే వస్తాయి. అంటే బలహీనత వల్ల గాని, బరువులు సరిగ్గా ఎత్తకపోవడం, రాంగ్ మూమెంట్ ప్రమాదాలు జరగడం వంటివి. కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మందికి వచ్చే బ్యాక్ పెయిన్ల గురించి చూద్దాం.
- డిస్క్ బల్జ్ అవ్వడం: అంటే వెన్ను ముక్కలో ఉండే ప్రతి చిన్న చిన్న బోన్ కి మధ్యలో డిస్క్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఒక్కొక్కసారి వీటి మీద ప్రెజర్ పెరిగిపోయినప్పుడు డిస్క్ కి బయట ఉండే లేయర్ వీక్ అయిపోయి లోపల ఉండే జెల్ వంటి భాగం బయట లేయర్ ని నొక్కి ఉబ్బినట్లుగా తయారవుతుంది. ఇది పక్కనే నాడులను నొక్కుతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో బ్యాక్ పెయిన్ వస్తుంది.
- హెర్నియేటెడ్ డిస్క్: దేంటంటే డిస్క్ బల్జ్ అవ్వడం కాకుండా ఏకంగా బయట లేయర్ చిరిగిపోయి లోపల ఉన్న జెల్ బయటకి వచ్చేసి పక్కన ఉన్న నాడులను నొక్కుతుంది . అప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది.
- మస్క్యులర్ టైప్ బ్యాక్ పెయిన్: అంటే సరిగ్గా కూర్చోకపోయినా ఎక్కువ బరువులు ఎత్తిన స్పైన్ చుట్టూ ఉండే మజిల్స్ బెనకడం పట్టేయడం మజిల్ ఫైబర్స్ చీలడం వంటివి జరుగుతుంది. దీనినే మజిల్ స్ట్రెయిన్ అని కూడా అంటారు. అప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది చాలా మందిలో కామన్ గా వచ్చే బ్యాక్ పెయిన్.
- స్పాండిలోస్తీసిస్: అంటే వెన్నె ముక్కలోని చిన్న చిన్న బోన్స్ అన్ని వరుసగా ఉంటాయి కదా వాటిలో ఒక బోన్ స్లిప్ అయ్యి దాని క్రింద ఉన్న దానికన్నా ముందుకు వచ్చేస్తుంది. ఇది కూడా బ్యాక్ పెయిన్ కి కారణం అవుతుంది.
- సయాటికా: ఇది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. నడుముకు క్రింద భాగంలో రెండు వైపుల నుండి మొదలై రెండు సయాటిక్ నెర్వలు పటక్స్ ద్వారా తొడలు, కాళ్ళు, పాదాల వరకు వెళ్తాయి. మన శరీరంలో అతి పొడవైన నాడులు ఇవే అయితే స్పైన్ లో ఉండే డిస్క్లు ఇలా కాలి భాగంలోకి వెళ్లే సయాటిక్ నెర్వలను ప్రెస్ చేయడం వల్ల కేవలం నడు నొప్పి మాత్రమే కాకుండా ఒకవైపు బయట భాగంలో గాని ఒకవైపు కాలిలో గాని కంటిన్యూస్ గా పెయిన్ రావడం తిమ్మిరి కాలు కదపడానికి ఇబ్బందిగా ఉండడం నడిచినప్పుడు నిలబడినప్పుడు కాలు నొప్పి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సయాటికా లక్షణాలు. ఎక్కువగా సయాటికాలో ఏదో ఒక వైపు కాలిలో మాత్రమే నొప్పి వస్తుంది. చాలా తక్కువ మందిలో మాత్రమే రెండు వైపులా వస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మెకానికల్ ఇష్యూస్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్లు.
ఇవి కాకుండా వెన్ను ముక్కలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ సోకడం, కిడ్నీలో స్టోన్స్ ఉండడం అంత ఎందుకు ఎక్కువ మానసిక వత్తిడి కి గురైనా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు మెడ వీపు భాగంలో ఉండే మజిల్స్ స్టిఫ్ గా మారడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అయితే కొంతమందిలో బ్యాక్ పెయిన్ రాగానే కిడ్నీలో స్టోన్స్ ఏమో అని అనుమానంతో భయపడుతుంటారు.
how to control back pain in telugu కిడ్నీలో స్టోన్స్ కి బ్యాక్ పెయిన్ కి తేడా ఏమిటి ?
మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు అంటే ఎక్కువగా నడిచినప్పుడు వంగినప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు నొప్పి వస్తుంటే అది కేవలం నడు నొప్పి అవుతుంది. అదే ఏ పని చేయకపోయినా పెయిన్ రావడం అది కూడా విపరీతమైన పెయిన్ రావడం, యూరిన్ కి వెళ్ళినప్పుడు మంట రావడం, యూరిన్ లో బ్లడ్ రావడం, ఒక్కొక్కసారి జ్వరం, వాంతులు రావడం, ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్ళడం ఇలాంటి సూచనలు ఉంటే కిడ్నీ సమస్య అవ్వచ్చు.
how to control back pain in telugu? బ్యాక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఇప్పుడు చెప్పుకున్న అన్ని సమస్యలకు మనం చేసే చిన్న చిన్న తప్పులే కారణం అవుతాయి. క్యాన్సర్, డయాబెటిస్ లో బ్యాక్ పెయిన్ అనేది ఒక వ్యాధి కాదు. నడుము భాగాన్ని ఎఫెక్ట్ చేసే కొన్ని కండిషన్స్ కి ఒక చూసిక అంతే. ఇది చాలా మందిలో వచ్చే ఒక కామన్ అనుబవం . చాలా వరకు 90% బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడం, మెడిసిన్ వాడడం, బ్యాక్ పెయిన్ కి సంబంధించిన స్ట్రెచింగ్స్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో మాత్రమే క్రానిక్ బ్యాక్ పెయిన్ గా మారి సర్జరీల వరకు వెళ్తాయి. అయితే ఈ బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలు చూసుకుంటే .
మొట్టమొదటిది: కూర్చున్న నిల్చున్న పడుకున్న బాడీ పొజిషన్ సరిగ్గా లేకపోతే వెన్నుముక్క మీద వత్తిడి మొదలు అవుతుంది. కొంతమంది టీవీ చూసేటప్పుడు ఫోన్ వాడేటప్పుడు సోఫాల మీద మంచాల మీద ఎలా పడితే అలా కూర్చుంటారు పడుకుంటారు. అది కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది కంఫ్యూటర్ దగ్గర కూర్చొని జాబ్ చేస్తూ ఉంటున్నారు. ఆ వర్క్ చేసేటప్పుడు ముందుకు వంగి చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. మనం వర్క్ చేస్తున్నప్పుడు మన చెవులు ఎప్పుడూ భుజానికి సమానంగా స్ట్రెయిట్ గా ఉండేలా కూర్చోవాలి. లోవర్ బ్యాక్ సపోర్ట్ ఉండే చైర్స్ వాడడం లేదా లంబార్ పిల్లోస్ వాడడం మంచిది. మనం వర్క్ చేసే కంప్యూటర్ స్క్రీన్ మన కంటికి స్ట్రెయిట్ గా ఉండాలి. అంతకంటే తక్కువ లేదా ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. అంతెందుకు స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. మనలో చాలామంది మొబైల్ ని చూసినప్పుడు తల ముందుకు వంచి వాడుతుంటాం కదా సాధారణంగా మన తల బరువు 5 kg ఉంటుంది. మన తలని స్ట్రెయిట్ గా ఉంచినప్పుడు మెడమీద కేవలం ఆ 5 kgల బరువు మాత్రమే పడుతుంది. కానీ అదే మనం ఫోన్ చూసేటప్పుడు తలని కేవలం 15° ముందుకు వంచితే అది వెన్నుముక్కలోని సర్వైకల్ స్పైన్ ఏరియా అంటే C1 నుండి C7 వెర్టిబ్రేల మీద మన తల 12 kgల ప్రెజర్ ని క్రియేట్ చేస్తుంది. అదే 30° ముందుకు వంచితే 18 kg లు, 45 డిగ్రీలు ముందుకు వంచితే 22 kg లు, 60 డిగ్రీలు ముందుకు వంచితే 27 kg లు. ఇలా ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. దీని వల్ల ఫ్యూచర్ లో మెడ భాగంలో వాపు రావడం, బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. దీనినే టెక్ నెక్ అంటారు.కాబట్టి మొబైల్ ని కూడా మన ఐ లెవల్ లో పట్టుకుని చూడాలి. కానీ క్రిందకి పట్టుకుని మెడ వంచి చూడకూడదు. ఈ బ్యాడ్ పోస్టర్ వల్ల కలిగే పరిణామాలు ఇప్పుడు తెలియవు కానీ ఫ్యూచర్ లో ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి కరెక్ట్ పొజిషన్ లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్.
- రెండవది: సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే బాడీకి చాలా తక్కువ లేదా అసలు పని లేకపోవడం ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. రోజుకి ఆరు గంటల కన్నా ఎక్కువ సేపు కూర్చునే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చొని ఉండడం వల్ల బ్యాక్ మజిల్స్ స్టిఫ్ గా మారిపోతాయి. అలాగే పొట్టలోని మజిల్స్ కూడా బలం లేకుండా వీక్ గా అయిపోతాయి. పొట్టలో ఉండే కండరాలు బలంగా ఉంటే అది నడుముకి కూడా సపోర్ట్ గా ఉంటాయి. అందుకే రెగ్యులర్ గా ఎక్సర్సైజులు చేస్తూ వీటి బలం పెంచుకోవాలి. లేదా బాడీ ఫ్లెక్సిబిలిటీ ని పెంచే యోగ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం తప్పదు అనుకున్న వాళ్ళు కనీసం అరగంటకో గంటకో ఒకసారి లేచి స్ట్రెచింగ్ చేయడం కొంచెం దూరం నడవడం చేయాలి.
- మూడవది: చాల మంది బరువులు ఎత్తేటప్పుడు డైరెక్ట్ గా వంగి వెయిట్ లేపేస్తూ ఉంటారు అలాంటప్పుడు వెంటనే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది కరెక్ట్ పొజిషన్ కాదు. ఏదైనా బరువు ఉన్న వస్తువుని లేపాలి అనుకున్నప్పుడు క్రిందకి కూర్చున్నట్లుగా మోకాళ్ళ దగ్గర బెండ్ అవ్వాలి. తప్పితే నడుము బెండ్ అవ్వకూడదు. నడుము స్ట్రైట్ గానే ఉండాలి. వెయిట్ ని మన బాడీకి దగ్గరగా తీసుకొని కాళ్ళ సహాయంతో పైకి లేవాలి. అలాగే మన చేతుల్లో బరువైన వస్తువులు ఉన్నప్పుడు బాడీని పక్కకు తిప్పకూడదు. అలాగే మనం ఎంత వెయిట్ లేపగలమో అంత వెయిట్ ని మాత్రమే లేపడానికి ప్రయత్నించాలి కానీ కొంతమంది గొప్పల కోసం తమకు మించిన బరువును లేపడానికి ట్రై చేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు.
- నాలుగవది: కొంతమంది బైక్ మీద జర్నీ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు వచ్చిన గతుకులు వచ్చిన స్పీడ్ తగ్గించకుండా వేగంగా వెళ్ళిపోతుంటారు. అలా గతుకులలో పడినప్పుడు బాడీలో ఒక జర్క్ క్రియేట్ అయ్యి స్పైన్ మీద విపరీతమైన ప్రెజర్ పడుతుంది. అలాంటప్పుడు డిస్క్లు డ్ామేజ్ అయ్యి బ్యాక్ పెయిన్ రావచ్చు. కాబట్టి స్లోగా చూసుకొని డ్రైవ్ చేయడం మంచిది.
- ఐదవది: బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే కూర్చున్నా, లేచినా, వంగినా ఇలా ప్రతిసారి ఆ బాడీ వెయిట్ అంతా కూడా బ్యాక్ మీద పడుతుంది. కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాలి. ముఖ్యంగా పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళలో వెన్ను ముక్క మీద ప్రెజర్ పెరిగి ఎక్కువ వంగి పోతుంది. కాబట్టి వెయిట్ తగ్గించుకోవాలి.
- ఆరవది: డిహైడ్రేషన్ అంటే సరిపడా వాటర్ తాగకపోయినా బ్యాక్ పెయిన్ ఇస్తుంది. ఎందుకంటే వెన్ను ముక్కలోని డిస్క్లు 80% వాటర్ తోనే తయారై ఉంటాయి. బాడీలో సరిపడా వాటర్ లేకపోతే ఈ డిస్క్లలో వాటర్ కంటెంట్ లేక కుషన్ తగ్గిపోయి స్టిఫ్ గా మారిపోతాయి. దీనివల్ల డిస్క్లు సన్నగా మారిపోయి బోన్ కి బోన్ కి మధ్య ప్రెజర్ పెరిగిపోతుంది. కాబట్టి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి.
- ఏడవది: కొంతమంది ఆడవాళ్ళు హై హీల్ వాడుతుంటారు. దీనివల్ల వాళ్ళ పోదిషణ్ మారిపోతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు వెళ్తుంది. దానిని బాలెన్స్ చేయడానికి ఆ ప్రెజర్ అంతా కూడా వెన్నుముక్క అలాగే దాని చుట్టూ ఉండే కండరాల మీద పడుతుంది. దీని వలన లాంగ్ రన్ లో బ్యాక్ పెయిన్ వస్తుంది. కాబట్టి హై హీల్స్ వాడకపోవడం మంచిది. అలాగే పడుకున్నప్పుడు కూడా వెళ్ళకలా పడుకోవడం మంచిది. అలా కాకుండా బోర్లా పొట్ట మీద పడుకుంటే వెన్ను ముక్క కొంత ట్విస్ట్ అవుతుంది. అది లాంగ్ రన్ లో ఇబ్బంది అవ్వచ్చు. అలాగే మరీ మెత్తగా దూదిలా ఉండే బెడ్ల మీద పడుకోవడం కూడా మంచిది కాదు. మొదట్లో కంఫర్టబుల్ గా అనిపించవచ్చు కానీ వాటి మీద పడుకున్నప్పుడు స్పైనల్ అలైన్మెంట్ కరెక్ట్ గా ఉండదు. అలాగే వెళ్ళకిలా పడుకున్నప్పుడు కాళ్ళ కింద పక్కకు తిరిగి పడుకున్నప్పుడు రెండు కాళ్ళ మధ్య పిల్లో లాంటిది పెట్టుకుంటే వెన్ను ముక్క మీద ప్రెజర్ పడదు దీనివల్ల బ్యాక్ పెయిన్ ఉన్నవారికి కూడా కొంత రిలీఫ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనం చేసే తప్పుల వల్ల బ్యాక్ పెయిన్ రావడానికి కారణాలు. కానీ వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా డిస్క్లో కుషన్ తగ్గడం బ్యాక్ మజల్స్ వీక్ అవ్వడం జరుగుతుంది. కానీ మనం పైన చెప్పుకున్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిస్క్ డీజనరేషన్ అనేది స్లో చేయవచ్చు. ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవచ్చు.

