గుండెకు రహస్య శత్రువు ..లిపోప్రొటీన్ (యల్ .పీ.A) heart attack symptoms
heart health వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న గుండెపోటు కేసులు కలవరపరుస్తున్నాయి. మంచి ఆహారం తింటూ, నిత్యం వ్యాయామం చేస్తూ, లిక్కర్, ధూమపానానికి దూరంగా ఉంటున్నప్పటికీ హార్ట్ అటాక్ లేదా కరోనరీ వ్యాధుల బారిన పడుతున్నారు. దీనికి లిపోప్రొటీన్ (యల్ .పీ.A) కూడా ఓ రహస్య కారణమని వైద్యులు వెల్లడించారు . ప్రామాణిక స్క్రీనింగ్ టెస్టులు కూడా గుర్తించని కొలెస్ట్రాల్ యొక్క రహస్య రూపమే లిపోప్రొటీన్ (యల్ .పీ.A).
(యల్ .పీ.A) అంటే ఏమిటి? అది ఎందుకు గుండెకు ప్రమాదకరం? heart health
మన శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు వంటి కొవ్వులు రక్తంలో రవాణా కావడంలో లిపోప్రొటీన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఒక ప్రత్యేక రకం లిపోప్రొటీన్ (ఎ) లేదా (యల్ .పీ.A). ఇది సాధారణ యల్.డి.యల్ ( లో డెన్సిటి లిప్పిడ్ ప్రొఫైల్) లాంటి రూపం కలిగి ఉంటుంది.
అయితే దానిలోని అపోలిపోప్రొటీన్(a) – అపో (a) అనే జిగట రూపంలో ఉండే అదనపు ప్రొటీన్ వల్ల ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. సాధారణ యల్.డి.యల్ లాగా ఇది కూడా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ను నిల్వ చేయగలదు. యల్ .పీ.A- 30 మిల్లి గ్రామ్స్/dL లేదా 75 nmol/L లోపు ఉంటే సాధారణంగా పరిగణిస్తారు.
అంతకుమించి ఉంటే హృద్రోగాలు, స్ట్రోక్, హార్ట్ అటాక్ ముప్పు ఎక్కువ. యల్ .పీ.A అనేది ఫుడ్,వ్యాయామానికి ప్రతిస్పందించదు. యల్ .పీ.A స్థాయిలు పెరిగే సమస్యలు జనాభాలో 20 నుంచి 30 శాతం మందిని ప్రభావితం చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ గుండెపోటు, స్ట్రోక్, కవాట వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
భారతీయులకే ఎక్కువ ముప్పు..heart health
సౌత్ ఏషియా, ముఖ్యంగా భారతీయుల్లో యల్ .పీ.A ప్రమాదం ఎక్కువగా ఉంది. శ్వేత జాతి జనాభాతో పోలిస్తే ఈ వ్యాధి రెండు నుంచి 3 రెట్లు మనకు ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. దాదాపు 25 శాతం మంది భారతీయులు అధిక యల్ .పీ.A ను కలిగిఉన్నారు. దీన్ని సాధారణ లిపిడ్ ప్రొపైల్ లో గుర్తించలేరు. అందుకే దీనివల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
యల్ .పీ.A ఎవరు టెస్టు చేయించుకోవాలి?
కుటుంబంలో గుండె జబ్బుల హిస్టరీ ఉన్నవారు, సాధారణ కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ గుండె జబ్బుల సమస్య ఉన్నప్పుడు యల్ .పీ.A టెస్టును చేయించుకోవాలి. ఇదొక సాధారణ రక్తపరీక్ష. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. తద్వారా నివారణ చర్యలను
చేపట్టవచ్చు.
చికిత్స ఎలా?
ప్రస్తుతం పూర్తిస్థాయిలో నివారించే మందులు అందుబాటులో లేవు. అయితే లెపోడిసిరాన్
(థెరపీ), పెలాకార్సెన్ (యాంటిసెన్స్ ఒలిగోన్యూక్లియోటైడ్) వంటి కొత్త ప్రయోగాత్మక మందులు క్లినికల్ ట్రయల్స్లో 90% వరకు ప్రభావవంతంగా పనిచేశాయి. ఈ చికిత్సలు రాబోయే సంవత్సరాల్లో హృదయ సంబంధ సమస్యల నివారణలో విప్లవాత్మక మార్పులు
తీసుకురాగలవు.
యల్ .పీ.A తగ్గించుకోవడానికి ముఖ్యమైన చిట్కాలు

- యల్ .పీ.A స్థాయిని నేరుగా తగ్గించడం కష్టమే. ఎందుకంటే ఇది ప్రధానంగా జన్యు ఆధారితం . అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా హృద్రోగ ముప్పును తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
- పండ్లు, కూరగాయలు, గింజలు, చేపలు, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి.
వెన్న, నెయ్యి, ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్ను వీలైనంత దూరం పెట్టండి. చేపలు,
ఫ్లాక్స్ సీడ్స్, వాల్ నట్స్ వంటివి తీసుకోవడం మంచిది. - రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా వ్యాయామం చేయడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
రక్తపోటు, డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవాలి. - క్రమం తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్, యల్ .పీ.A స్థాయిలు, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

