importance of healthy diet 
healthy diet chart ఆరోగ్య అభిలాష లందరికీ నమస్కారం ఈరోజుల్లో పిల్లలు పుట్టటమే ఒక వరంగా భావించే రోజులు అందరికి ఆరోగ్యవంతమైన పండంటి బిడ్డలను కణాలని కోరిక ఉంటుంది కానీ కొన్ని తప్పిదాల వల్ల కొంతమంది సంతానానికి నోచుకోక పోతే మరి కొంతమంది సరియైన అవగాహన లేక గర్భవతిగా ఉన్న సమయంలో ఏవి పడితే అవి తిని గర్భాన్ని కోల్పోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటున్నారు. మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో గర్భాశయం ఆరోగ్యం చాలా ముఖ్యం. దీనిపై తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే సంతానం కోరుకొనే తల్లులు, మెనోపాజ్ మహిళలు గర్భాశయం బలంగా ఉండటానికి ఎటువంటి ఆహారం తిసుకొకుడాదో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో తీసుకోవాలో మనం తెలుసుకుందాం.
గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోకూడదంటే?
healthy diet chart గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రకాలైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనే విషయాలు మనం గమనించినట్లైతే.
ఫాస్ట్ ఫుడ్స్: ప్రస్తుతం మనకు అందుబాటులో పిజ్జాలు , బర్గర్స్ ,మసాలా కారం దండిగా వున్న చికెన్ ఫ్రై ,పాణి పూరి , న్యూడిల్స్, ఇలా వివిధ రకాలైన పాస్ట్ పుడ్స్ ఉన్నాయి. ఇవి గర్బవతి
ఆరోగ్యానికి, శిశువు ఆరోగ్యానికి ఇవి మంచివి కావు. ఇవి పోషకాహారం కాకపోగా అనేక ఆరోగ్య
సమస్యలను కూడా కలగజేయవచ్చు.
తీపి పదార్థాలు: ప్రెగ్నెన్సీ సమయంలో తియ్యటి పదార్ధాలు తినాలి అనిపిస్తుంది దీనికి కారణం గర్బవతి సమయంలో సాధారణంగా క్రేవింగ్స్ ఎక్కువ ఉండడం వలన తీపి పదార్థాలు ఎక్కువగా తినాలి అనిపిస్తుంది. అయితే ఈ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వలన మధుమేహం వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకూ తీపి పదార్ధాలను
తక్కువగా తీసుకోవడం మంచిది.
రెడ్ మీట్: మాంసాహారంలో రెడ్ మీట్ గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. ప్రాసెస్ చేసిన లేదా చేయని రెడ్ మీట్ ఏదైనా కూడా గర్భవతులలో ఆరోగ్య సమస్యలను కలగజేయవచ్చు. ఈ కారణంగా గర్భిణులు ఈ రకమైన మీట క్కు దూరంగా ఉండడం అవసరం.
కూల్ డ్రింక్స్, సోడా: ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాలైన కూల్ డ్రింక్స్ లో కెఫీన్ అధికంగా ఉంటుంది. కెఫీన్ వలన శిశువు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉండడమే కాకుండా శిశువు ఎదుగుదల మందగించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి గర్భవతిగా
ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్, సోడాలను తీసుకోకూడదు.
కాఫీ, టీ: చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ రెండిటిలో కూడా కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.
గర్భాశయ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
- ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ఇది గర్భాశయాన్ని బలంగా ఉంచుతుంది. ఆహారంలోని వ్యర్థాలని బయటకు నెట్టి అంతర్గత వాపులు రాకుండా చూస్తుంది.
- విటమిన్ సి ఉండే పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి బయోఫ్లేవనాయిడ్స్న పెంచి గర్భాశయంలో కణితులు ఏర్పడకుండా రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తినీ పెంచుతాయి.
- విటమిన్ డి, క్యాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. గ్రీన్ టీ తాగడం కూడా చాలా మంచిది.
క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండే
కూరగాయల్ని తినాలి. ఇవి గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడకుండా కాపాడతాయి.
గుమ్మడి, అవిసె, నువ్వులు వంటి గింజలను ఉదయాన్నే తీసుకుంటే వీటిలో ఉండే ఒమేగా-3, ఫ్యాటీ ఆమ్లాలు గర్భాశయ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

