healthy tips for eating
health tips మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు మన ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని రహస్యమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- మంచి ఆరోగ్యం లభించడంతో ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది వారంలో ఒక్క రోజైనా సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినండి దీనివల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరికాయను తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినండి.
- ప్రతి వారంలో రెండు సార్లు ఖచ్చితంగా బీట్రూట్ ను తినండి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
- నెయ్యి తింటే బరువు పెరుగుతారేమో అని అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా ముసలితనం రాదు .
- ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయను కలుపుకొని తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది .
- మనలో చాలా మందికి తరచు తుమ్ములు జలుబు దురదలు వస్తుంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు రెండు అల్లం ముక్కలను వేసి తాగితే ఎలర్జీ సమస్యలన్నీ తగ్గిపోతాయి.
- ఒక స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
- అల్లం తురుము కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి.
- ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ప్రతి రోజు కొన్ని ధనియాలను తినడం వల్ల గ్యాస్ అసిడిటీ సమస్యలను తగ్గిపోతాయి.
- పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులో ఉన్న నులి పురుగులు నశిస్తాయి ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లిని తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ మీ క్యాలరీలను స్పీడ్ గా బర్న్ చేస్తాయి అలాగే హై బీపి ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే బీపి కంట్రోల్ అవుతుంది .
- ప్రతి రోజు ఒక క్యారెట్ ను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది క్యారెట్ లో బీటా కెరోట్ ఉంటుంది క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల రాకుండా ఉంటాయి చర్మం పైన ఉన్న ముడతలను తగ్గించడంలో క్యారెట్స్ బాగా ఉపయోగపడతాయి .
- నోటి దుర్వాసనతో బాధపడేవారు ఒక లవంగాన్ని నమలండి నోటి దుర్వాసన తగ్గిపోతుంది .
- మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో పేసి ఆ కొబ్బరి నూనెను మరగబెట్టి చల్లార్చిన తర్వాత తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు రాకుండా మీ జుట్టు బాగా పెరుగుతుంది .
- తెగిన గాయాల పైన ఆవునెయ్యి తిని పూస్తే త్వరగా గాయాలు మానిపోతాయి .
- మధుమేహం సమస్యలతో బాధపడేవారు ఉసిరి పొడిలో కొంచెం పసుపు వేసుకొని తింటే మధుమేహం తగ్గిపోతుంది.
- జ్వరం త్వరగా తగ్గాలంటే తులసి ఆకుల రసంలో రెండు చెంచాల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది గొరువెచ్చని పాలలో మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది .
- విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకోండి మంచి ప్రభావం ఉంటుంది .
healthy tips for eating
- నడుము నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి కొబ్బరి నూనెను వేడి చేయండి దీన్ని చల్లారిన తర్వాత నొప్పి ఉన్నచోట మర్దన చేయండి నడుము నొప్పి సమస్యలు తగ్గిపోతాయి .
- జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- ఒక గ్లాసు నీటిలో కొంచెం యాలకుల పొడిని కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి.
- నెయ్యిలో కొంచెం బెల్లం పొడిని వేసి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది .
- బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే అసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి తరచు ఎక్కువగా బెల్లంను తింటే లివర్ లో ఉండే విష పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి .
- చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి.
- దగ్గు సమస్యలతో బాధపడేవారు అల్లం ముక్కని ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని అందులో చిటికెడు జీలకర్ర పొడి వేసుకొని తింటే వెంటనే దగ్గు తగ్గుతుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి.
29 Health and Nutrition Tips
- ముఖం పైన ఉన్న పులిపిర్లు ఊడిపోవాలంటే రావి చెట్టు పండును తీసుకొని వాటిని గుజ్జుగా నూరి పులిపిర్లు పైన రాసుకుంటే పులిపిర్లు ఊడి పడిపోతాయి
- ఈ రోజుల్లో చాలా మంది ఆడవారికి వైట్ డిస్చార్జ్ ఎక్కువగా అవుతుంది అలాంటి వారు ప్రతిరోజు కొద్దిగా జీలకర్రను తినండి తెల్లబట్ట రోగం హరించిపోతుంది .
- ఈ రోజుల్లో చాలా మంది ఆడవారికి తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి మీ తల వెంట్రుకలు రాలకుండా మీ వెంట్రుకల దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు అలాగే లేతగా ఉన్న రావి ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించండి ఇక మీ తల వెంట్రుకలు రాలకుండా మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది.
చాలామంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాదు దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంటుంది పొట్లకాయ మరియు కోడిగుడ్డును కలిపి తింటే మీ జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలయ్యి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి మొలకెత్తిన పెసలు అలాగే బాదం పప్పును ఎక్కువగా తీసుకోండి వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే మనలో చాలా మంది మాంసాహారాన్ని తినేప్పుడు కూల్ డ్రింక్ లను తాగుతారు మాంసాహారం తినేటప్పుడు కూల్ డ్రింకులు తాగితే మీ ఆరోగ్యం పైన చెడు ప్రభావం ఉంటుంది .

