ఈ తప్పుల వల్లే పిల్లలు పుట్టట్లేదు
fertility problems women సంతానం అనేది దంపతులకు ఓ వరం వంటిది. వివాహమైన తర్వాత ప్రతి మహిళా తల్లి కావాలని తపిస్తూ ఉంటుంది. అయితే వివిధ కారణాల వల్ల కొందరికి సంతానం అందడంలో ఆలస్యం అవుతుంటుంది. మరికొందరికి జీవితాంతం అది తీరని కోరికగానేఉండిపోతుంటుంది. అయితే ఎక్కువ శాతం.. తాము తెలీక చేసే తప్పుల వల్లే సంతానలేమి సమస్య ఎదురవుతోందని మాత్రం గుర్తించరు. పిల్లలు పుట్టకపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకుందాం….
ఇన్ఫెర్టిలిటీ: దీన్నే సంతానలేమి లేదా వంధ్యత్వం అని కూడా అంటారు. చాలామందిలో ఉండే అపోహ ఏంటంటే.. సంతానలేమి సమస్య కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఉంటుందని అనుకుంటారు. కానీ.. ఇన్ఫెర్టిలిటీ సమస్య అనేది ఇద్దరిలోనూ ఉండొచ్చు. మగవాళ్లలోనూ… ఆడవాళ్లలోనూ ఇద్దరిలో సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య ఉన్నవాళ్లకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఒకప్పుడు అంటే మన తాతల కాలంలో సంతానలేమి సమస్యలు చాలా తక్కువగా ఉండేవి. కానీ.. ఈ జనరేషన్లో సంతానలేమి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఇద్దరిలో ఇప్పుడు సంతానలేమి సమస్యలు వస్తున్నాయి.
సంతానలేమికి అసలు కారణాలు ఏంటి?
1. హార్మోన్ల అసమతుల్యత: శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత, బరువు సమస్యలు పెరుగుతాయి. తద్వారా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మహిళల్లో అండాశయ పనితీరునూ పురుషులలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో ఇప్పటికే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) తో బాధపడే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శారీరక శ్రమ లేకపోతే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. ఇక నిశ్చల జీవనశైలి పురుషులలో స్పెర్మ్ కౌంట్ను, నాణ్యతను తగ్గించి మొత్తం లైంగిక పనితీరును దెబ్బతీస్తుంది.
2. ధూమపానం: సంతానలేమి సమస్య తలెత్తడానికి ధూమపానం మరో ప్రధాన సమస్య. పొగాకులో కాడ్మియం, కోటినిన్ వంటి విషపూరిత మూలకాలు ఉండడం వల్ల.. ధూమపానం చేసే స్త్రీలలో అండాల ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే అండం గోడలు మందంగా మారడం వల్ల శుక్రకణాలు (Sperm cells) ప్రవేశించడానికి అవకాశం ఉండదు. తద్వారా గర్భధారణ కష్టమవుతుంది.
3. మద్యపానం: అదే విధంగా మద్యపానం చేసే స్త్రీల శరీరంలో గర్భధారణకు అవసరమైన విటమిన్ బి, జింక్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇలాంటి స్త్రీలు గర్భం దాల్చడం కష్టం అవుతుంది. ఒకవేల గర్భం దాల్చినా అబార్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పారిశ్రామిక రసాయనాలు లేదా రేడియేషన్కు గురికావడం వల్ల కూడా సంతానలేమి సమస్య ఉత్పన్నమవుతుంటుంది.
4. డ్రగ్స్ వ్యసనం: సంతానం కలగకపోవడానికి డ్రగ్స్ వ్యసనం (Drug addiction) కూడా మరో కారణం కావొచ్చు. ఈ వ్యసనం కారణంగా ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాలు కొనసాగించే ప్రమాదం ఉంది. దీనివల్ల క్లామిడియా, ఎయిడ్స్ వంటి వ్యాధులు సోకుతాయి. దీని కారణంగా సంతానలేమి సమస్య ఎక్కువ అవుతుంది. అలాగే ఉన్నట్టుండి బరువు పెరగడం, అదేవిధంగా ఉన్నట్లుండి బరువు తగ్గడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది. మానసిక ఆరోగ్యం, ఒత్తిడి: ఒత్తిడి, ఆందోళన కారణంగా గర్భధారణ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురువుతుంటాయి. మానసిక సమస్యల వల్ల గర్భం దాల్చే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
5. గర్భధారణ వాయిదా వేయడం: కొందరు గర్భం వాయిదా వేసేందుకు వివిధ రకాల మందులు తీసుకుంటూ ఉంటారు. మరికొందరు గర్భం దాల్చకుండా ఉండేందుకు ఇంజెక్షన్లు కూడా తీసుకుంటుంటారు. కాలక్రమేణా ఇలాంటి వారిలో కూడా సంతానం కలగడం కష్టంగా మారుతుంటుంది. అదేవిధంగా అండాశయం నుంచి అండం విడుదలవడంలో సమస్య ఉండడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది. ఉదరం లేదా పొత్తికడుపుకి శస్త్ర చికిత్స జరిగి ఉండడం వల్ల కూడా సంతానలేమి సమస్య తలెత్తుతుంది.
6. శరీర బరువు: శరీరం బరువు పెరగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. మహిళ తల్లి అవడానికి బీఎమ్ ఐ 30 కంటే ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా గర్భాశయంలో గడ్డలు, గర్భాశయం ఆకారం సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. పుట్టుకతో వచ్చే వివిధ రకాల రుగ్మతల వల్ల కూడా సంతానలేమి సమస్య ఉత్పన్నమవుతుంటుంది. అలాగే సరైన వ్యాయామం లేకపోవడంతో పాటూ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది.
సంతానలేమి స మస్యలు పెరగడానికి కారణం ఏంటి?
ఈ సమస్యలే ఎక్కువ: స్త్రీలలో ఎక్కువగా హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్, ట్యూబల్ బ్లాక్స్, లో ఓవేరియన్ డిఫెక్ట్, గర్భాశయ, ఎండో మెట్రియాసిస్ సమస్యలు సంతానలేమికి కారణమవుతున్నాయి. కొందరు సకాలంలో సంతానం కలగలేదనే ఉద్దేశంతో నాటు వైద్యాలను ఆశ్రయిస్తుంటారు. అవగాహన లేకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంకా సమస్యలు పెరుగుతాయి.
fertility problems women సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలి?
దంపతులు సంతానలేమికి గల నిజమైన కారణాన్ని తెలుసుకుని, దానికి తగినట్టు వారు వైద్య చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా యోగా, ధ్యానం చేయడం వల్ల మహిళల్లో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో పాటు పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, యాంటీ ఆక్సిడెంట్లు
ఎక్కవగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే రుతుక్రమం సకాలంలో రాని మహిళలు.. వెంటనే గైనకాలజిస్టును సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. ప్రస్తుతం యువత అనారోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడటమే సంతానలేమి సమస్యలకు మూలకారణం. అందుకే.. ఆరోగ్యకరమైన జీవనశైలితో… చెడు అలవాట్లకు దూరంగా ఉంటే.. సంతానలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు.

