eye problems symptoms

eye problems symptoms

eye problems treatment : కళ్ళు మసకగా కనిపిస్తున్నాయా..?

eye problems symptoms ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక  నమస్కారములు వయసుతో సంబంధం లేకుండానే కంటి చూపు తగ్గిపోవటము ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంకా చూపు తగ్గడం రాను అద్దాల యొక్క మోతాదు పెంచుకొని వెళ్లాల్సి వస్తుంది బాగా  స్ట్రైన్ అవ్వటము మరి ఇవన్నీ ఈ రోజుల్లో చదువుకునే చిన్న వయసు పిల్లల నుంచి పెద్దవారి వరకు కంటి సమస్య అనేది ఎక్కువగా కావటానికి ప్రధానమైన కారణాలు .

ఇక్కడ మనం  చెప్పుకునేది ఏంటంటే రెస్ట్ తగ్గటం వల్ల ,నిద్ర తగ్గటం వల్ల, కంటి చూపు ఎక్కువ  డామేజ్ అవుతున్నది. రెండోది సెల్ ఫోన్లు కంప్యూటర్లు స్క్రీన్లు చిన్న చిన్న వాటిని ఎక్కువగా చూడటం వల్ల కంటి చూపు ఎక్కువ డామేజ్ అవుతుంది ఈ లైట్లు ఎక్కువ  కంటి మీద రాత్రి వేళలో కూడా ఎక్కువ పడటం వల్ల కూడా కంటి చూపు డామేజ్ అవుతున్నది అని తెలుసు అందుకని వీటిని వీలైనంత వరకు దూరం చేయాలి అదే విధంగా పోషకాలు తగ్గటం వల్ల కూడా కంటి చూపు ఎక్కువ దెబ్బ తింటుంది.

eye problems symptoms

ఐతే పోషకాల  మీద రకరకాల పరిశోధనలు జరిగాయి ఒకరు విటమిన్ సి మీదే పరిశోధన చేసారు ఒకరు విటమిన్ డి మీద చేశారు ఇంకొకరు విటమిన్ ఈ మీద పరిచోధనలు చేసారు. ఇప్పుడు ఉదాహరణకి విటమిన్ సి ఉంది ఈ విటమిన్ సి కంటి చూపు దెబ్బ తిన్న వాళ్ళకి లోపల టెస్టులు తీసుకుంటే వీళ్ళకి లోపం కనపడుతున్నది కంటి చూపు బాగా ఉన్న వాళ్ళకి తీసుకుంటే ఇది కనిపించట్లా అట్లాగే విటమిన్ ఏ విటమిన్ డి ఈ కంటి చూపు దెబ్బ తినే వారిలో ఇవన్నీ లోపాలు కనపడటం రెండు గ్రూపులుగా విడగొట్టి చేసినప్పుడు క్లియర్  గా కనపడింది కాబట్టి కంటి చూపుకి కి పోషకాహారానికి సంబంధం అంతగా లేదు అని చాలా మంది కొట్టి పడేస్తూ ఉంటారు కాని వీటి వల్ల కళ్ళు చూపు కోల్పోతున్నాయి. కానీ ఈ మధ్య ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ వారు కొన్ని పరిక్షలు చేసి కంటి చూపుకు పోశాకాలకు కూడా ఎక్కువ  సంబంధం ఉందని క్లియర్ గా ఎవిడెన్స్ లతో కనపడుతుందని 2023 లో వాళ్ళు రిలీజ్ చేసిన  పరిశోధన పత్రంలో ఇవన్నీ క్లియర్ గా ఇవ్వటం జరిగింది.

eye problems symptoms

 ఈ మధ్య పిల్లలకి చూపు సరిగా లేదన్నప్పుడు ఏదో చూపు తగ్గుతున్నది అన్నప్పుడు ఐ డ్రాప్స్ లాంటివి కొన్ని ఇస్తూ మల్టీ విటమిన్ క్యాప్సుల్స్ వీళ్ళకి ఇవ్వటం కంపల్సరీ చేస్తున్నారు ఈ మధ్య ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అట్లా మొదలైంది ఎందుకంటే ఇలాంటి పరిశోధనలు ఈ మధ్య ఎక్కువ రుజువు  అవుతున్నాయి కాబట్టి పోషకాహార లోపం  అనేది కంటి చూపుని తగ్గించేటట్టుగా  చేస్తున్నాయని తెలుస్తున్నది కాబట్టి ఇక నుంచి అయినా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ కి  ఇట్లా వేసుకోవడం కంటే కూడా కాస్త ఈ పోషకాలు అందేటట్టు మంచి ఆహారాలు తీసుకోగలిగితే పిల్లలకి  చూపు ఇంకా డామేజ్ అవ్వకుండా ఉండటానికి చూపు ఇంకా బాగా మెరుగవ్వటానికి కూడా అవకాశం ఉన్నది.

 అలాంటి ఆరు పోషకాల విషయాల్లో ఒక్కసారి ఆలోచిస్తే మొట్టమొదటిది విటమిన్  ఏ ఇది మీ అందరికీ తెలుసు అన్నిటికంటే ఎక్కువగా కరివేపాకు కొత్తిమీరలో ఉంటుంది కొత్తిమీర కాస్త భోజనాలు తినేటప్పుడు పైన అట్లా చల్లుకొని తినటము కొత్తిమీర కూడా  కాస్త ఉడికేటప్పుడు లాస్ట్ లో అట్లా వేసి తీసేయటము చాలా మంచిది ఆకుకూర ఎక్కువ రోజు పెడితే ఈ విటమిన్ ఏ లోపం లేకుండా వెళ్ళిపోతుంది ఈ ఆకుకూరలు కొత్తిమీర ఇవి తీసుకోవడం వల్ల ల్యూటిన్ జియోక్తిన్ కూడా ఈ రెండు వెళ్ళిపోతాయి అందుకని ఆకుకూరల ద్వారా రెండు పోషకాలను మీరు సమృద్ధిగా అందించడానికి అవకాశం ఉన్నది అందుకని కంపల్సరీగా భోజనాల్లో ఆకుకూరలు ఎక్కువ మోతాదులో వండాలి లేదా కొంచెం కాకుండా కాస్త ఎక్కువ వెళ్ళేటట్టు చేయండి వంటలు వండేటప్పుడు కూడా గ్రేవీల కోసం నీళ్లు పోసి చింతపండు గొజ్జు పోసి వండేటప్పుడు అలాంటి పద్ధతి కంటే తోటకూర పాలకూర ఇట్లాంటి వాటిని కొద్దిగా గ్రైండ్ చేసి ఆ  గ్రేవీలకి ఈ గ్రైండ్ చేసిన జ్యూసులు గనక పోసేస్తుంటే చాలా మంచిది పోషకాలు ఎక్కు వెళ్తాయి అన్ని కూరల్లో ఈ జ్యూసులు కూడా పోస్తూ ఉండొచ్చు.

eye problems treatment

మరొకటి ఒకటి ఇక విటమిన్ సి వేడి చేసిన వాటిలో ఇది నశిస్తుంది అందుకని మనం వేడి చేయకుండా తినేవి ఎక్కువగా వాడాలి అందులో అన్నిటికంటే జామకాయ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు ఒక జామకాయ పిల్లలకు బాగా తినిపిస్తే ఇది కంటిలో మరి ఎక్కడ సెల్స్ లో ఇన్ఫ్లమేషన్ లేకుండా కాపాడటానికి కంటి హెల్త్ కి విటమిన్ సి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లా పనికొస్తుంది .

మరో  పోషకం విటమిన్ ఈ ఇది బాదం పప్పులు పొద్దు  తిరుగుడు పప్పుల్లో బాగా ఎక్కువ ఉంటుంది అందుకని రోజు పొద్దు తిరుగడు పప్పు  తింటుంటే విటమిన్ ఈ బాగా వెళ్లి కంటి లోపల లెన్స్ లో ఉండే టిష్యూ ని తిరిగి రిపేర్ చేయటానికి  దాని స్తానంలో  ఏమైనా వస్తే కొత్త కొత్త వాటిని తిరిగి పునరుత్పత్తి చేయడానికి విటమిన్ ఈ బాగా కావాలి అందుకని ఈ పోషకం ఈ రెండిట్లో బాగా ఉంటుంది పిల్లల్ని వీటిని  దృష్టిలో పెట్టుకొని తినిపించేటట్టు మీరు చేయాలి.

 మరో పోషకం విటమిన్ డి ఈ విటమిన్ డి అనేది నూటికి 90 మంది 80 మంది పిల్లలకు లోపం ఉంటుంది మీ పిల్లలకి విటమిన్ డి లోపం ఉందా లేదా అసలు మీరు చెక్ చేయించుకోవట్లేదు అందుకని ఒకసారి నేను అన్నందుకైనా పిల్లలకి విటమిన్ డి టెస్ట్ చేయించండి ఎందుకంటే ఇంట్లో నుంచి బడిలోకి వెళ్లి కూర్చోవడం బడిలో నుంచి బస్సులో ఇంటికి రావడం తప్ప ఎక్కడ ఎండల్లోకి వెళ్ళట్లేదు అందుకని ఏడు ఎనిమిదేళ్లు పదేళ్ల వయసు పిల్లల నుంచి విటమిన్ డి లోపం స్టార్ట్ అయింది  కాబట్టి  లోపం  ఉంటే మాత్రం కంటికి కూడా విటమిన్ డి లోపం అనేది ఎక్కువగా హాని కలిగిస్తున్నది అనేది మీరు తెలుసుకోవాలి  కాబట్టి దాన్ని అందేటట్టు చూడండి ఎండల్లోకి పంపండి ఎండలో కుదరకపోతే  విటమిన్ డి సప్లిమెంట్ తప్పదు ఇక వేరే ఆహారాలు విటమిన్ డి అందదు మనకి పిల్లలకు విటమిన్ డి టాబ్లెట్ నెలకొకటి వేస్తే సరిపోతూ ఉంటుంది అట్లా అందించే ప్రయత్నం  చేయండి.

పిల్లల ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాల్లో ఒమేగా-3 ఫ్యాట్స్ ఒకటి. ఇవి ముఖ్యంగా మెదడు అభివృద్ధి, కంటి చూపు మెరుగుదల, శరీరంలో ఉండే ఒత్తిడి తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడతాయి. సహజంగా ఇవి సోయా సీడ్స్, వాల్నట్స్ (ఆక్రోట్లు), సబ్జా గింజలు (బసిల్ సీడ్స్), మరియు అవిస గింజలలో ఎక్కువగా ఉంటాయి. పిల్లలు సులభంగా తినేటట్లు ఉండేందుకు, సోయా లేదా సబ్జా గింజలను నీటిలో నానబెట్టి ఫ్రూట్స్ మీద చల్లి ఇవ్వవచ్చు. వాల్నట్స్‌ను నేరుగా తినొచ్చు లేదా చిన్న ముక్కలుగా చేసి ఇవ్వొచ్చు. అవిస గింజలు కొంచెం వేడి మీద వేపి పొడి చేసి కూరల్లో కలిపితే రుచి కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. హైదరాబాద్‌లోని ప్రసిద్ధమైన ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూషన్ వారు చేసిన పరిశోధనల ప్రకారం, ఈ పోషకాల లోపం వల్ల కంటి చూపు బలహీనమయ్యే ప్రమాదం వుందని హెచ్చరించారు . అందువల్ల,  పిల్లలు , పెద్దలు పోషకాలను అలవాటు చేయడం చాలా అవసరం.

 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *