sex health tips : పురుషుల్లో అంగస్తంభన సమస్య?

sex health tips : పురుషుల్లో అంగస్తంభన సమస్య?

 sex health tips : పురుషుల్లో అంగస్తంభన సిగ్గు వద్దు.. నిర్లక్ష్యం చేస్తే ముప్పు

sex health tips : పురుషుల్లో అంగస్తంభన సమస్య? ఇటీవల కాలంలో పురుషుల్లో అంగస్తంభన (Erectile Dysfunction) సమస్య పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రతి 10 మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే భారతీయ సమాజంలో పురుషుల లైంగిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడం లేదు. ఫలితంగా జంటల్లో పిల్లలు పుట్టని సందర్భంలో మహిళలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ సమస్యపై చర్చించడానికి పురుషులు సిగ్గు, భయం లేకుండా ముందుకు రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పురుషుల్లో ఈ సమస్య తలెత్తడానికి కారణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

అసలు అంగస్తంభన అంటే ఏంటి? What exactly is erectile dysfunction?

శృంగార సమయంలో అంగం గట్టిపడకపోవడాన్నే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లోపం అంటారు. పురుషాంగానికి రక్తప్రసరణ సరిగా లేకపోవడం లేదా పురుషాంగ నరాలు దెబ్బతినడం వల్ల ఈ అంగస్తంభన లోపం రావొచ్చు. చాలా మంది ఇది వృద్ధాప్యంలో వచ్చే ఇబ్బంది అని అనుకుంటారు. కానీ పురుషులలో ఏ వయసులోనైనా వచ్చే సాధారణ సమస్య
ఇది. దీని కారణంగా లైంగిక కోరికలు, ఆసక్తి తగ్గడం, ముందుగానే స్కలనం, ఆలస్యంగా స్కలనం, భావప్రాప్తిలో సంతృప్తి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీని వల్ల పురుషుల్లో ఒత్తిడి పెరిగి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మీరు పిల్లల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

అంగస్తంభనకు కారణాలు.Causes of erectile dysfunction in men?

శారీరక, మానసిక కారణాలవల్ల సమస్య సంభవించవచ్చు.

లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్: ధూమపానం, మద్యం, ఊబకాయం, శారీరక శ్రమలేకపోవడం

మానసిక కారణాలు: ఒత్తిడి, ఆందోళన, నిరాశ, రిలేషన్షిప్ Vascular issues: మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బుల వల్ల రక్తప్రవాహం సరిగా లేకపోవడం.

నాడీ సంబంధిత పరిస్థితులు: వెన్నెముక గాయాలు లేదా మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటివి.

హార్మోన్ల అసమతుల్యత: తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు.

కొన్ని రకాల మెడిసిన్: నిరాశ, డిప్రెషన్ థెరపీ మందులు, రక్తపోటు లేదా ప్రోస్టేట్ సమస్యలకు తీసుకునే మందులు కూడా అంగస్తంభనకు కారణం.

పురుషులు ఈ సమస్యను ఎందుకు చెప్పుకోరు?

సమాజ పరిస్థితుల దృష్ట్యా సిగ్గు, భయంతో పురుషులు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దీని కారణంగా మగవారు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా, ఈ సమస్యను బయటికి చెప్పుకోలేకపోతారు. దీని గురించి ఇతరులకు తెలిస్తే వారు తమను
చులకనగా చూస్తారని భావిస్తారు. దీని వల్ల లోలోపలే బాధపడతారు. పైగా దీనికి చికిత్స ఉండదనే అపోహ చాలా మందిలో ఉంది. అందుకే వైద్యుని దగ్గరకు వెళ్లరు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. దీనివల్ల కుటుంబంలో గొడవలు తలెత్తే అవకాశం ఉంది.

చికిత్స ఎలా? How to treat erectile dysfunction in men?

ఫిజికల్ ఎగ్జామినేషన్, కొన్ని ప్రాథమిక టెస్టుల ద్వారా అంగస్తంభన సమస్యను గుర్తించవచ్చు. ఇందుకు కొన్ని రకాల సాధారణ చికిత్సలు ఉన్నాయి.

జీవనశైలి మార్పులు: బరువు తగ్గడం, రోజూ వ్యాయామం, ధూమపానం, మద్యం మానేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం.

ఓరల్ మెడిసన్స్: వైద్యుల సూచనతో తగితన మోతాదులో సిల్డెనాఫిల్, తడలాఫిల్, వర్దనాఫిల్ వంటి మందులు తీసుకోవచ్చు.

హర్మోనల్ థెరపీ: నోటి ద్వారా లేదా ఇంజెక్షన్ ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచేందుకు వైద్యులు మందులను ఇస్తారు.

నాణ్యమైన ఫుడ్: సీజన్ల వారీగా వచ్చే పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు తీసుకోవాలి.

కౌన్సెలింగ్: మానసిక ఇబ్బందులు ఉన్నవారికి నిపుణులైన సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్: పైన సూచించిన మార్గాల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే చివరగా వాక్యూమ్ ఎరక్షన్ డివైజెస్, పురుషాంగ ఇంజెక్షన్లు లేదా అవసరమైతే శస్త్రచికిత్సను వైద్యులు సూచిస్తారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.

అంగస్తంభన అనేది పురుషత్వం లేదా వ్యక్తిగత వైఫల్యాన్ని ప్రతిబింబించదు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన పనిలేదు. చికిత్సల ద్వారా వంద శాతం పురోగతి సాధించవచ్చు. పురుషులు ధైర్యంగా ముందుకొచ్చి ఈ సమస్యపై మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే చికిత్స తీసుకుని ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యంగా, ఆనందంగా ముందుకెళ్లాలి. నిశబ్దాన్ని బ్రేక్
చేసి ఆండ్రాలజిస్ట్లో ఈ సమస్య గురించి మాట్లాడండి.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *