diabetes symptoms

diabetes symptoms

                                     diabetes

How to Identify Diabetes type 1 and 2
diabetes డయాబెటిస్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే షుగర్ ఇ వ్యాధి మన బంధువుల్లో గాని లేదా మనకు తెలిసిన వాళ్ళలో కాని ఎవరో ఒకరు ఇ షుగర్ వ్యాధితో బాధపడుతూ కనిపిస్తారు ప్రపంచంలో  800  వందల  కోట్ల జనాభాలో 56 కోట్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు అంటే అది ఎంత ప్రమాదకరమో మనకు అర్ధం అవుతుంది.
  ప్రపంచ వ్యాప్తంగా  సుమారుగా నలభై రెండు లక్షల మంది కేవలం డయాబెటిస్ వల్ల చనిపోయారు దీనికి ముఖ్య కారణం మనకు షుగర్ వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడమే  షుగర్  వచ్చినప్పుడు బాడీ లో ఏం జరుగుతుంది, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అసలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు పాటించాలి అని తెలుసుకుందాం.
షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసిన విషయం  ఎందుకంటే ఏదో షుగర్ ఉంది అంటే ఉంది అన్నట్లు కాకుండా దాని గురించి పూర్తి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం కేవలం షుగర్ ఉన్నవారికి మాత్రమే కాదు లేని వాళ్ళుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

diabetes 

షుగర్ బారిన పడకుండా  మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో  ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి  ఏదైనా ఆహారం తిన్న ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ గా  విచ్చిన్నమవుతయి  గ్లూకోజ్ అంటే మన బ్లడ్ లో ఉండే ఒక రకమైన చెక్కర కణాలు మనం తిన్న ఆహారం గ్లూకోజ్ గా మారినప్పుడే అది రక్తంలో కలిసి అన్ని  కణాలకు తీసుకెళ్తుంది  అయితే దీనికోసం ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి సింపుల్గా చెప్పాలంటే వాటర్ ట్యాంకర్ అంటే క్లోమ గ్రంధి,  దిని నుండి నుండి విడుదలయ్యే మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ను బట్టి ఈ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఒకవేళ కావలసినంత ఇన్సులిన్ విడుదల చేయకపోతే మనకు ఎనర్జీ అనేది ఉండదు ఇలా  కొన్ని రకాలు ఉన్నాయి అవేంటో చూద్దాం  diabetes symptoms

టైప్ వన్ డయాబెటిస్:ఆటో ఇమ్య్నీటి  కండిషన్ అంటే క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ను మనలో వుండే బీటాకణాలను మనలో  విడుదల అయినటువంటి  ఇమ్య్నీటి శక్తి  ని నాశనం చేస్తుంది  అలా బీటా కణాలు ఇన్సులిన్ నాశనం చేయడం వలన  జీవితాంతం బయటి నుంచి ఇన్సులిన్ని ఇంజెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఒకసారి ఇంజక్షన్ చేయించుకోవడానికి  భయపడతాం ఇది చిన్న పిల్లలో వస్తుంది టైప్ వన్ డయాబెటిస్ సోకినవాళ్ళు జీవితం మొత్తం ఇన్సులిన్ తీసుకొని బ్రతకాలి.

 రెండవది టైప్ 2 డయాబెటిస్ : ఇది ఎక్కువగా పెద్దవాళ్ళుకు వస్తుంది కొంతమంది బయట దొరికే పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవల్స్  అలా పెరిగి పోతుంటయి . పెరిగి పోయిన గ్లూకోజ్ లెవల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఫ్యాన్ క్రియేట్ గ్రంధి మరింత ఇన్సలిన్ విడుదల చేస్తుంది. ఇన్సులిన్ అవసరం పెరిగిపోవడంతో శరీరానికి కావలసినంత ఇన్సులిన్ విడుదల చేయలేని స్థితికి ఫ్యాన్ క్రియేట్ గ్రంధి వచ్చేస్తుంది అలాంటప్పుడు కానీ ఈ ఇన్సులిన్ కి శరీరంలో ఉండే కణాలు రియాక్ట్ అవ్వవు  అందువల్ల గ్లూకోజ్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఎక్కడికక్కడ కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది చాలామంది పెద్ద వారికి వచ్చేది యి టైప్ 2 డయాబెటిస్   అయితే  దీనికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే ఆహారం, వంశ పారం పర్యంగా రావడం , బాడీ యాక్టివ్ గా లేకపోవడం  అంటే శరీరానికి సరిపడినంత పని లేక పోవడం ప్రధానకారణం.
మూడవది జాస్టిస్నాల్ డయాబెటిస్ : ఇది  స్త్రీలకు వస్తుంది కానీ ఇది పర్మినెంట్ గా ఉండదు కేవలం గర్బం వతి సమయంలో  ఉంటుంది అది కూడా 5 నుండి 7 శాతం మందిలో వస్తుంది  మంచి డైట్ తీసుకుంటూ గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ చేసుకుంటే ఏ సమస్య ఉండదు కానీ నెగ్లెట్ చేస్తే తల్లికి పుట్టబోయే బిడ్డకు ప్రమాదం అంటే బ్లడ్ లో  గ్లూకోజ్ పెరిగిపోవడం దీనికి ప్రధానకారనం
   ఈ డయాబెటిస్ అంటే బ్లడ్ లో గ్లూకోజ్ పెరిగిపోవడం వలన మన శరీరంలో ఏ ఏ భాగంలో ప్రబావం  చూపిస్తుందో చూద్దాం 
 డయాబెటిస్ సోకినప్పుడు ముఖ్యంగా కళ్ళు, గుండె, కిడ్నీలు ,కాళ్లు, ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటాయి  ఎందుకంటే రక్తంలో ఈ గ్లూకోజ్ చిక్కగా పేరుకుపోయి రక్తనాళాలు దెబ్బతింటాయి రక్తనాళాలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి చిన్నవి, రెండవది పెద్దవి, చిన్న రక్తనాళాలు కళ్ళు మరియు కిడ్నీలలో ఉంటాయి పెద్ద రక్తనాళాలు గుండె మరియు కాళ్లలో ఉంటాయి కల్ల భాగంలో ఈ గ్లూకోస్ పేరుకుపోవడం వల్ల కన్ను మసకగా కనపడతాయి ఎక్కువగా ఉత్పత్తి అయిన గ్లూకోస్ ని కిడ్నీల ద్వారా బయటకు పంపిస్తాయి అందువల్లనే షుగర్ ఉన్నవారికి మూత్రం ఎక్కువగా వస్తుంది  దీనివల్ల మూత్రపిండాలపై భారం పడి మూత్రపిండాలు ఎక్కువగా దెబ్బ తింటాయి  ఈ షుగర్ వ్యాధి ఉన్నవారికి  మనం ముందు చెప్పినట్లుగా రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ సరిగా లేక ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు త్వరగా మానవు మన శరీరంలో కణాల్లోకి గ్లూకోస్ వెళితేనే మనకి ఎనర్జీ ఉంటుంది షుగర్ వ్యాధి సోకిన వారిలో కణాల్లోకి ఇన్సులిన్ వెళ్లకపోవడం వల్ల నీరసంగా కనిపిస్తారు ఒక్కోసారి అమాంతం బరువు తగ్గిపోతుంటారు డయాబెటిస్ వచ్చిన వారిలో పాదాలలో నరాలు దెబ్బతిని నొప్పి గాని తెలియదు సాధారణంగా ఏదైనా ఒక వ్యాధి వస్తే అది శరీరంలో ఏదో ఒక బాగమే దెబ్బతింటుంది కానీ షుగర్ వ్యాధి  అల కాదు ఇది కంటికి కనిపించకుండా లోపల మన బాడి మొత్తం తన అధినంలోకి తెచ్చుకుంటుంది  దీనివల్ల  శరీరం నెమ్మదిగా సచ్చు పడిపోయి చివరిగా ప్రాణాల మీదికి వస్తుంది .

diabetes షుగర్ వ్యాధి ని వ్యాధిని ఎలా గుర్తించాలి 

  • మన హైట్ కి తగ్గ బరువు ఉన్నామా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ ఎం ఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేసుకోండి
  •  అనుకోకుండా బరువు తగ్గడం
  •  బాగా నీరసంగా ఉండడం
  •  శరీరానికి గాయాలైనప్పుడు మానకపోవడం
  •  ఎక్కువగా దాహం వేయడం
  • కళ్ళు మసకగా కనిపించడం
  • రాత్రి పూట మూత్రం ఎక్కువగా రావడం
  • పాదాలు స్పర్శ కోల్పోవడం
ఇలాంటి వన్ని మనకు షుగర్ వ్యాధి సోకిందని చెప్పడానికి సంకేతాలు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా యి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు వంశపారపర్యంగా వచ్చే దానిని మనం ఏమి చేయలేము కానీ దినిని ఎక్కువగా ఊహించుకొని భయపడవలసిన అవసరం లేదు మనం ముందు చెప్పుకున్న ప్రమాదకరమైనది టైప్ వన్ డయాబెటిస్ 5 నుండి 10 శాతం మందికి మాత్రమే వస్తుంది.  టైప్ 2 డయాబెటిస్ మనం కంట్రోల్ చేసుకోగలిగేదే కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *