cancer symptoms in telugu
పెరుగుతున్న నోటి క్యాన్సర్ కేసులు నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
cancer symptoms in telugu మాట్లాడటానికి, తినటానికి, ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది కూడా నోటి నుంచే. తిన్న ఆహారం లాలాజలంతో కలిసి జీర్ణక్రియ ఆరంభమయ్యేదీ కూడా ఇక్కడే. ఇంత కీలకమైనది కాబట్టే నోటికి ఏసమస్య వచ్చినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నోటిలోని వివిధ రకాల కణాలను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్ నే నోటి క్యాన్సర్ (Oral Cancer) అంటారు. ఈ నోటి క్యాన్సర్ పెదవుల దగ్గర నుంచి నాలుక,నాలుక కింది భాగం, చిగుళ్లు, దంతాలు, లోపలి బుగ్గలు, గొంతు మొదలైన వాటిల్లో ఎక్కడైనా రావొచ్చు. స్త్రీలతో పోలిస్తే పురుషులకు నోటి క్యాన్సర్
వచ్చే ప్రమాదం ఎక్కువ. ఏ వయసులోనైనా నోటి క్యాన్సర్ రావొచ్చు. 45లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా నోటి క్యాన్సర్ పుండుగానే మొదలవుతుంది. అయితే ఈ నోటి పుండ్లను చాలా మంది పెద్దగాపట్టించుకోకుండా అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో ఎక్కువ మందిలో ముదిరిన తర్వాతే ఈ క్యాన్సర్ బయటపడుతోంది. మనదేశంలో 85-90% నోటి క్యాన్సర్ కేసులు పొగాకు, మద్యం మొదలైనటువంటి దురలవాట్ల వల్లే కారణం క్యాన్సర్ లక్షణాలు, చికిత్సకు సంబంధించినవి అవి వేమిటో చూద్దాం.
cancer symptoms నోటి క్యాన్సర్ లక్షణాలు
- నోటి క్యాన్సర్ చాలావరకు పుండుగానే మొదలవుతుంది. ఇది కణితి రూపంలో ఏర్పడటం చాలా అరుదు. ఈ పుండ్లు పెదవులు, నాలుక, అంగిలి, నాలుక కింద, బుగ్గల్లో ఎక్కడైనా ఏర్పడొచ్చు.క్యాన్సర్ తీవ్రమైతే నోటి కండరాలు క్షీణిస్తాయి. దీంతో నోరు తెరవటం కష్టమవుతుంది. నోటి లోపలి భాగం మరియు చిగుళ్లలో క్యాన్సర్ఉన్నట్టయితే దంతాలు వదులై, కదిలిపోవొచ్చు.
- నోటి క్యాన్సర్ గల వారిలో నోటి పుండ్లు, చిగుళ్ల వ్యాధి వల్ల గొంతు నుంచి రక్తస్రావం అవుతున్నట్లు అనిపించవచ్చు. క్యాన్సర్ ఏర్పడుతున్నప్పుడు ఆ శరీరభాగం దగ్గర నాడులు క్షీణిస్తాయి కాబట్టి తొలిదశలో నోటిలో పుండు ఉన్నా నొప్పి తెలియదు. క్యాన్సర్ ముదురుతున్న కొద్దీ నొప్పి మొదలవుతుంది. నోటిలో, గొంతు భాగంలో పుండ్లు రావడం వల్ల ఆహార పదార్థాలను నమలడం, కష్టంగా మారుతుంది. అలాగే మాట్లాడడంలో ఇబ్బంది కూడా వస్తుంది.
- గొంతు వెనక మరియు పైభాగంలో క్యాన్సర్ తలెత్తితే చెవి నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. నోటి క్యాన్సర్ తీవ్రమైన దశలో ఉంటే తినటం కష్టంగా మారి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
- నోట్లో నాడులు దెబ్బతింటే నాలుక, దవడ వంటి భాగాల్లో స్పర్శ లేక రుచి తెలియక మొద్దుబారినట్టు అనిపించవచ్చు. కొన్నిసార్లు గొంతులో గడ్డలు, వాపులు కనిపిస్తాయి. పై లక్షణాలతో పాటు నోరు మరియు మెడ భాగంలో నొప్పి, తిమ్మిరిగా కూడా అనిపించవచ్చు.
cancer symptoms నోటి క్యాన్సర్ రావడానికి కారణాలు
- క్యాన్సర్ కేసుల్లో దాదాపు 5 శాతం నుంచి 10 శాతం వరకూ వారసత్వంగానే వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నోటి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం పొగాకు వాడకం.
- దీంతో పాటుగా సిగరెట్లు, చుట్టలు, బీడీల వంటివి కాల్చటము, పొగాకు, పొగాకు కట్టలు, జర్దా, గుట్కాలను నమలడం వల్ల వీటిలో కలిపే రసాయనాలు క్యాన్సర్కు దారితీయవచ్చు. అదేపనిగా వక్కలు నమలటం వల్ల నోట్లో అతి సూక్ష్మంగా పగుళ్లు ఏర్పడి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది.
- మద్యపానం క్యాన్సర్కు బలమైన కారకం. మద్యం శరీరంలోకి వెళ్లిన తర్వాత ఎసిటాల్డిహైడ్ గా మారుతుంది. దీనికి క్యాన్సర్ను కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- కృత్రిమ దంతాలు, కట్టుడు పళ్లు స్థిరంగా లేకపోతే తరచూ బుగ్గలకు తాకి పళ్ల మధ్య చర్మం పడి, పుండు ఏర్పడొచ్చు. ఇవి మానకుండా పెద్దగా అయ్యి, క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. నోరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల దీర్ఘకాలంగా నోట్లో వాపు ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్)కు దారితీయడంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కేకాదు, నోటి క్యాన్సర్కు కూడా కారణమే. ఇటీవల ఎలాంటి దురలవాట్లు లేని 18-25 ఏళ్ల యువతుల్లోనూ నోటి క్యాన్సర్ కనిపిస్తుండటానికి ఈ వైరసే కారణమని వైద్య పరీక్షల్లో వెల్లడైంది.
cancer symptoms నోటి క్యాన్సర్ నిర్ధారణ – చికిత్స విధానాలు
- నోటి క్యాన్సర్ చికిత్స ఏర్పడిన కణితి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. నోరు మరియు గొంతుకు సంబంధించిన ఇమేజింగ్ పరీక్షలు (X-RAY, CT, MRI, PET-CT Scan), ఎండోస్కోపీ, బేరియం స్వాలో వంటి పరీక్షల ద్వారా నోటి క్యాన్సర్ను నిర్ధారించడం జరుగుతుంది.
- అయితే కచ్చితమైన రోగనిర్ధారణకు అన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. నోటి క్యాన్సర్ ఒకటి, రెండు దశల్లో ఉంటే చాలావరకూ సర్జరీతోనే నయం చేయొచ్చు. మూడో దశలో శస్త్రచికిత్సతో పాటు రేడియేషన్ అవసరమవుతుంది. నాలుగో దశలో సర్జరీ, రేడియేషన్తో పాటు మరి కొందరికి కీమో కూడా చేయాల్సి ఉంటుంది.
cancer symptoms నోటి క్యాన్సర్ నియంత్రణకు సూచనలు
- ధూమపానం, మధ్యపానం పూర్తిగా మానేయాలి. సమతుల్య పోషకాహారం తీసుకోవాలి. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలి.
- పొగాకు, పొగాకు కట్టలు, జర్దా, గుట్కాలను నమలడాన్ని పూర్తిగా మానేయాలి. యువతులు వైద్యుని సూచనలతో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) టీకాలు తీసుకోవాలి.రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. మీ వంశంలో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడి ఉంటే ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.


