Asthma Permanent Treatment

Asthma Permanent Treatment

asthma symptoms in telugu

ఆస్తమా గురించి ఆందోళన వద్దు ఈ జాగ్రత్తలు పాటించండి

Asthma Permanent Treatment ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బాధించే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి ఆస్తమా. ఇది రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. శ్వాసకోశ మార్గాల్లో వాపు, అడ్డంకులు కారణంగా ఊపిరితీసుకునేటప్పుడు పిల్లికూతలు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. దీన్ని శాశ్వతంగా నివారించలేము, కొన్ని జాగ్రత్తల ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చ. ఆస్తమాను అర్థం చేసుకోవడం ఆస్తమా వల్ల శ్వాసనాళాలు సాధారణంగా పనిచేయవలసిన విధంగా పనిచేయవు. అవి వాపునకు గురై మందంగా మారతాయి. దీనివల్ల శ్వాస తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఫలితంగా గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు పిల్లికూతల శబ్దం, శ్వాస ఆడకపోవడానికి దారితీస్తుంది. వాపు కారణంగా శ్వాసనాళాలు అధిక మొత్తంలో శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది వాయుమార్గాలను అడ్డుకొని దగ్గు రావడం, ఛాతి దగ్గర పట్టేసినట్లుగా అనిపిస్తుంది.

ఆస్తమాకు కారణాలు

  1. పుప్పొడి (చెట్లు, గడ్డి, కలుపు మొక్కలు), దుమ్ము, పురుగులు, పెంపుడు జంతువుల చర్మం (బొచ్చు, లాలాజలం), బొద్దింకలు వంటి అలెర్జీ కారకాలు ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తాయి. పొగాకు పొగ, వాయు కాలుష్యం, పెర్ఫ్యూమ్స్, గాఢమైన వాసనకలిగిన ఫ్లోర్ క్లీనర్స్, చల్లని గాలి, పొడి గాలి, రసాయనాల నుంచి వెలువడే పొగ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందతలెత్తుతాయి.
  2. వైరల్ ఇన్ఫెక్షన్లు (జలుబు, ఫ్లూ), సైనసైటిస్ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు వాయుమార్గాల్లో వాపును పెంచి శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. ఒత్తిడి, ఆందోళన శ్వాసనాళాలను సంకోచింపజేసి ఆస్తమా లక్షణాలను మరింత పెరిగేలా చేస్తాయి. ఆస్పిరిన్, NSAID (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్)లు మరియు బీటా-బ్లాకర్లు వంటి కొన్ని మందులు కొంతమంది వ్యక్తులలో ఆస్తమాను ప్రేరేపిస్తాయి.

ఆస్తమా లక్షణాలు

ఆస్తమా లక్షణాల తీవ్రత అనేది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. శ్వాస సమయంలో, ముఖ్యంగా ఊపిరి వదిలేటప్పుడు ఈల వేసిన శబ్దం రావడం, తరచుగా రాత్రి లేదా తెల్లవారుజామున తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో బరువుగా అనిపించడం, శ్వాస వేగంగా తీసుకోవడం, నిద్ర భంగం కారణంగా అలసట, లక్షణాలు తీవ్రమైతే మాటల్లో ఇబ్బంది, భయం, ఆందోళన వంటివి కనిపిస్తాయి.

ఆస్తమా నిర్ధారణ

స్పెరోమెట్రీ, పీక్ ఫ్లో మీటర్, ఎక్స్ఫేల్డ్ నైట్రిక్ ఆక్సెడ్ (FeNO) టెస్ట్, అలెర్జీ పరీక్ష, ఛాతి ఎక్స్-రే ద్వారా అస్తమాను నిర్ణయిస్తారు. కొన్నిసార్లు వివిధ రక్త పరీక్షలను కూడా సూచిస్తారు.

ఆస్తమా చికిత్స

ఆస్తమాకు ప్రత్యేకంగా చికిత్స లేదు. దీని నుంచి ఉపశమనం కోసం దీర్ఘకాలిక మందులను వాడటంతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆస్తమా నుంచి ఉపశమనం కోసం ఇనెల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ (ICS),
లాంగ్-యాక్టింగ్ బీటా-అగోనిస్ట్స్, ల్యూకోట్రియన్ మోడిఫైయర్స్, మాస్ట్ సెల్ స్టెబిలైజర్స్ వంటి దీర్ఘకాలిక మందులను వైద్యులు సూచిస్తుంటారు. త్వరిత ఉపశమనం కోసం షార్ట్-యాక్టింగ్ బీటా-అగోనిస్ట్స్ (SABAs), యాంటికోలినెర్జిక్స్, ఓరల్ కార్టికోస్టెరాయిడ్స్ వంటి వాటిని సూచిస్తారు.
వీటిని తప్పనిసరిగా వైద్యుని సూచనమేరకు మాత్రమే ఆస్తమా బాధితులు వాడాల్సి ఉంటుంది. ఆస్తమా లక్షణాల నివారణకు ఇమ్యునోథెరపీ (అలెర్జీ షాట్స్), కొన్ని రకాల శ్వాస వ్యాయామ పద్ధతులను డాక్టర్లు సూచిస్తున్నారు.

ఆస్తమా.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

* శ్వాస సమస్యలు బాగా తీవ్రమైనప్పుడు లేదా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలిగినప్పుడు

* పెదవులు, గోళ్లు నీలం రంగులోకి మారడం, అతిగా ఆందోళన లేదా మగతగా అనిపించడం.

* మాట్లాడటంలో తడబాటు, పూర్తిగా మాట్లాడలేకపోవడం, తక్షణ ఉపశమన మందులు వాడినా.. ఆస్తమా లక్షణాలు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

  • పాలకూర, రెడ్ క్యాప్సికం, ఉల్లి వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. అలాగే కమల, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్ ‘సి’ ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాపిల్లో ఉండే ‘ఫైటోకెమికల్స్’, యాపిల్ తొక్కలో ఉండే ‘లైకోఫిన్’
    వంటివి అస్తమాతో ఇబ్బంది పడే వారిలో ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.
  • బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరిస్తే దుమ్ము, ధూళి, పొగమంచు, అలర్జీ నుంచి రక్షణ లభిస్తుంది. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. వైద్యుల సూచన మేరకు ఇన్స్టాలేషన్ థెరపీని అనుసరించడం సురక్షితమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలు, ఔషధాలు తీసుకుంటే ఆస్తమా నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *